Chay Sobhita : చైతన్య, శోభిత పెళ్లి ఎక్కడో తెలుసా..?

Chay Sobhita :  చైతన్య, శోభిత పెళ్లి ఎక్కడో తెలుసా..?
X

ఈ నెల 4న అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి జరగబోతోంది. పెళ్లికి సంబంధించిన విశేషాలన్నీ ఒకటొకటిగా పూర్తి చేస్తున్నారు. పెళ్లి కూతురును చేయడం నుంచి రాట కార్యక్రమం వరకూ అన్నీ సంప్రదాయంగా చేసుకుంటూ వస్తున్నారు. అంతకు ముందు నాగ చైతన్య, సమంత పెళ్లి గోవాలో జరిగింది. డెస్టినేషన్ మ్యారేజ్ గా వారి వివాహం జరిగింది. అందుకే ఈ సారి కూడా ఇంకేదైనా స్పెషల్ ప్లేస్ లో శోభిత మెడలో మూడు ముళ్లు వేస్తాడు అనుకున్నారు. స్పెషల్ ప్లేస్ లోనే ఈ పెళ్లి జరగబోతోంది. కానీ వేరే ప్రాంతంలో కాదు. హైదరాబాద్ లోనే. అది కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో.

యస్.. నాగ చైతన్య, శోభిత పెళ్లి అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరగబోతోంది. ఈ మేరకు తమకు తాతగారి ఆశిస్సులు కూడా ఉంటాయనే కారణంతోనే పెళ్లి అక్కడ ప్లాన్ చేసుకున్నారట. స్టూడియోస్ లో ఏఎన్నార్ పెద్ద విగ్రహం కూడా ఉంది కదా. పెళ్లికి ముందు, తర్వాత కూడా ఆ విగ్రహం వద్ద ఆశీర్వాదాలు తీసుకుంటారు అంటున్నారు. మొత్తంగా వీరిది కూడా డెస్టినేషన్ మ్యారేజ్ అనుకుంటే ఇలా సింపుల్ గా సొంత స్టూడియోలోనే పెళ్లి మండపం కట్టేసుకున్నారు.

Tags

Next Story