Akhanda 2 Trailer : అఖండ 2 ట్రైలర్ ఎక్కడ విడుదలవుతుంది..?

నందమూరి బాలకృష్ణ దూకుడు పెంచుతున్నాడు. తన నెక్ట్స్ మూవీ అఖండ 2 రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీతో ఉన్నాడు. బోయపాటి శ్రీను డబుల్ హ్యాట్రిక్ తో శ్రీకారం చుట్టాడు అఖండ 2తో. ఈ ఇద్దరి కాంబినేషన్ పైనా భారీ అంచనాలున్నాయి. అఖండ బ్లాక్ బస్టర్ అవడం వల్ల సెకండ్ పార్ట్ విషయంలో ప్యాన్ ఇండియా మార్కెట్ పైనే కన్నేశారు. రీసెంట్ గా ముంబైలో ఒక పాట విడుదల చేశారు. తాజాగా సంయుక్త తో ఒక డ్యూయొట్ విడుదల చేశారు. అంతకు ముందెప్పుడో టీజర్ తో మెప్పించాడు. సినిమాను డిసెంబర్ 5నే విడుదల చేయబోతున్నారు కాబట్టి.. ట్రైలర్ విషయంలో మాత్రం ఒక క్లారిటీతో కనిపించాల్సి ఉంది టీమ్.
అఖండ 2 ట్రైలర్ విషయంలో ఓ క్లారిటీతో రావాల్సి ఉంది టీమ్. తెలుగు మూవీ అయితే ప్రాబ్లమ్ లేదు. ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే అందులో భాగంగా తెలుగు నుంచి కాక కర్ణాటక, తమిళనాడు ప్రాంతంలో ట్రైలర్ విడుదల చేస్తే బెటర్ అనుకుంటున్నారు. కాకపోతే తమిళ్ లో బాలయ్యకు పెద్దగా మార్కెట్ లేదు. కర్ణాటకలో అయితే బావుంటుంది అని భావించారు. అందుకని కర్ణాటకలోనే ట్రైలర్ లోనే రిలీజ్ చేయబోతున్నారు అనే మాట వినిపిస్తోంది. మరి అఖండ 2 ట్రైలర్ విషయంలో ఓ క్లారిటీ వస్తే ఏర్పాట్లు కూడా మమ్మురంగా మొదలవుతాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

