పవిత్ర బంధం మూవీ మిస్ చేసుకున్న టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

పవిత్ర బంధం మూవీ మిస్ చేసుకున్న టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Pavitra Bandham: సురేష్ బాబు, వెంకటేష్ మాత్రం ఒకే చెప్పడంతో నిర్మాతలు అయిష్టంగానే స్టార్ట్ చేశారట.

Pavitra Bandham: ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, సౌందర్య హీరోహీరోయిన్లగా తెరకెక్కిన చిత్రం పవిత్ర బంధం. 1996లో వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెల్సిందే. ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటూ భార్య గొప్పతనాన్ని చెప్పే పాట సెన్షేషన్ క్రియేట్ చేసింది. సెంటిమెంట్ పుష్కలంగా గల ఈ సినిమాను మహిళా ఆడియన్స్ తో పాటు అందరూ బాగా ఆదరించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వెంకీ తండ్రి గెటప్ లో అదరగొట్టారు.

ముత్యాల సుబ్బయ్య ఈ మూవీ అనుకున్న దగ్గర నుంచి ఎన్నో ఎన్నో సిత్రాలు జరిగాయట. నిర్మాత సురేష్ బాబుని కలిసి సినిమా గురించి చెప్పగా... ఒకే చెప్పేశారట. నిర్మాతలు వెంకట్రాజు, శివరాజు ఈ సినిమా స్టోరీ నచ్చకపోవడంతో.. పరుచూరి బ్రదర్స్ తో మార్పులు చేయించారట ముత్యాల సుబ్బయ్య.

అయినా సరే, నిర్మాతలు ఒప్పుకోకపోవడమే కాక మరో స్టోరీతో తీయాలన్న నిర్ణయానికి వచ్చారట. కానీ సురేష్ బాబు, వెంకటేష్ మాత్రం ఒకే చెప్పడంతో నిర్మాతలు అయిష్టంగానే స్టార్ట్ చేశారట. ఇక మూవీలో ఎంతో కీలకమైన హీరోయిన్ పాత్రకు రమ్యకృష్ణ ని సెలక్ట్ చేశారంట నిర్మాతలు. అయితే సౌందర్యను ముత్యాల సుబ్బయ్య ప్రతిపాదించారట. మొత్తానికి డైరెక్టర్ మాట పైచేయి అయింది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా సౌందర్య నటన సూపర్బ్ గా వచ్చింది. ఈ సినిమా ప్రీక్లైమాక్స్ లో సౌందర్యతో చెప్పించిన డైలాగ్స్ అద్భుతంగా పేలాయి. ఇదే సినిమాను కన్నడలో రీమేక్ చేశారు. అందులో హీరోయిన్ గా రమ్యకృష్ణను తీసుకోవడం వేశేషం.

Tags

Read MoreRead Less
Next Story