Vijay Antony : విజయ్ ఆంటోనీ దర్శకుడిని మోసం చేసందెవరు..?

Vijay Antony : విజయ్ ఆంటోనీ దర్శకుడిని మోసం చేసందెవరు..?
X


ఏ దర్శకుడైనా తన సినిమాకు సంబంధించిన అవుట్ పుట్ అంతా చూసుకుని... అంతా తను అనుకున్నట్టుగా వచ్చింది అనుకున్న తర్వాతే సెన్సార్ వరకూ వెళతాడు. అఫ్ కోర్స్ ఇవన్నీ రిలీజ్ డేట్ టార్గెట్ గానే సాగుతాయి. మరి ఒక్కసారి సెన్సార్ అయిన తర్వాత కట్స్ ఏమైనా ఉంటే తీసేయాలి. లేదంటే ఆ సినిమాను అలాగే విడుదల చేయాలి. సెన్సార్ తర్వాత వారికి తెలియకుండా కొత్త సీన్స్ యాడ్ చేయకూడదు. చేసినా ఇందులో అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకుంటే సెన్సార్ కూడా లైట్ తీసుకుంటుంది. అదే దర్శకుడికి కూడా తెలియకుండా సీన్స్ యాడ్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి. పైగా ఆ యాడ్ అయిన సీన్ వల్లే సినిమాలో మెయిన్ సస్పెన్స్ పోతే.. ఆ సీన్ సినిమా ఆరంభంలోనే వస్తే ఇక అతని ఆవేదనను అర్థం చేసుకునేది ఎవరు..? సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేశాడట విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ ‘మలై పిడిక్కత మణితన్’ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్.

తెలుగులో తుఫాన్ గా ఈ నెల 9న విడుదల కాబోతోన్న విజయ్ ఆంటోనీ మూవీ తమిళ్ లో ఈ శుక్రవారమే విడుదలైంది. మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే తను థియేటర్ లో చూస్తున్నప్పుడు ఆరంభంలోనే తనకు తెలియకుండా ఒక సీన్ ఉందని.. అతన తను చేయలేదని.. ఎవరు చేశారో తెలియదు అంటున్నాడు దర్శకుడు మిల్టన్. ఈ సీన్ ముందే రావడం వల్ల సస్పెన్స్ ముందే రివీల్ అయిందని.. తద్వారా సినిమా రిజల్ట్ తేడా కొట్టే ప్రమాదం ఉందని వాపోతున్నాడీ దర్శకుడు. మరి నిజంగానే ఈ సీన్ అతనికి తెలియకుండా కలిపారా లేక ఇదేమైనా పబ్లిసిటీ స్టంటా అంటూ కోలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.

Tags

Next Story