Arul Saravanan : రిటైల్ స్టోర్స్ కింగ్.. సినీ ఇండస్ట్రీలో ది లెజెండ్ 'అరుల్ శరవణన్'

X
By - Divya Reddy |28 July 2022 2:01 PM IST
Arul Saravanan : ది లెజెండ్ సినిమా శరవణన్ ఎవరనేదానిపై ఇప్పుడు మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది
Arul Saravanan : ది లెజెండ్ సినిమా శరవణన్ ఎవరనేదానిపై ఇప్పుడు మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. గత కొంత కాలంగా ఆయన మూవీకి సంబంధించిన పోస్టర్లు, ట్రయిలర్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తమిళనాడులో ప్రతిష్టాత్మకమైన శరవణ రిటైల్ స్టోర్స్‌కు ఆయన అధిపతి. 51 ఏళ్ల ఆయన రిటైల్ బిజినెస్‌లో సక్సస్ సాధించారు. అయితే చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలంటే ఇష్టం కారణంగా మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టానని అన్నారు.
- 50 ఏళ్ల వయసు వచ్చే వరకు బిజినెస్.. తరువాత లెజెండ్ అరుల్ శరవణగా సినీ ఇండస్ట్రీలోకి
- రిటైల్ స్టోర్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరవణన్ సెల్వరత్నమ్ కుమారుడే అరుళ్ శరవణన్
- 1970 చెన్నైలో జన్మించిన శరవణ.. చదువు పూర్తయిన తరువాత తండ్రి రిటైల్ బిజినెస్‌లో ఎంట్రీ
- మోడల్‌గా కూడా రాణించారు.. శరవణ స్టోర్స్‌కు ఆయనే బ్రాండ్ అంబాసిడర్
- సినిమాపైన ఆసక్తితో చెన్నైలోని అడయార్ ఫిల్మ్ ఇన్స్‌టిట్యూట్‌లో ట్రైనింగ్
- అజిత్ సినిమా 'ఉల్లాసం' ఫేమ్ డైరెక్టర్ జీడీ జెర్రీ దర్శకత్వంలో ది లెజెండ్ మూవీని తెరకెక్కించారు. శరవణ ఇందులో శాస్త్రవేత్త పాత్రలో కనిపించారు.
- ది లెజెండ్‌లో ఊర్వశి రౌటెల హీరోయిన్‌గా నటించింది, హ్యారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చారు.
- శరవణన్‌కు సూర్యశ్రీతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. సోదరి వివాహానికి రూ.13 కోట్ల విలువైన దుస్తులను బహూకరించారు
- చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఆసక్తి.. సినిమాకు వయసు అడ్డంకి కాదనుకొనే నటించానన్నారు శరవణన్
- శరవణన్ స్టోర్స్ 2017లో 6వేల కోట్ల బిజినెస్ టర్నోవర్ చేసింది
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com