NTR - Devara 1 : దేవర ట్రోలింగ్స్ వెనక ఉన్నది ఎవరు..?

NTR - Devara 1 :  దేవర ట్రోలింగ్స్ వెనక ఉన్నది ఎవరు..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ జెనరేషన్ లో దేశంలో ఉన్న అతికొద్దిమంది గ్రేట్ యాక్టర్స్ లో ఒకడు. ఈ విషయం అతనితో వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ చెబుతారు. అతని సినిమాలు చూసినా అర్థం అవుతుంది. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ఓ రేంజ్ క్రియేట్ చేసుకున్నాడు. సరిగ్గా మీసాలు కూడా రాని వయసులో రికార్డులు బద్ధలు కొట్టాడు. యాక్షన్, డిక్షన్, డ్యాన్స్ ఈ మూడిట్లో ఎన్టీఆర్ ను కొట్టే హీరో టాలీవుడ్ లోనే లేడు అని గ్రాండ్ గా చెప్పుకుంటారు ఫ్యాన్స్. 2018లో వచ్చిన అరవింద సమేత తర్వాత అతను సోలో హీరోగా నటించిన సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ తో అతనెంత గ్రేట్ యాక్టర్ అనేది దేశం మొత్తం చూసింది. అందుకే అతని మూవీ వస్తోందంటే ఇప్పుడు ఈగర్ గా చూస్తోంది. ఓ వైపు ఇతర భాషా ప్రేక్షకులు ఈ మూవీ కోసం చూస్తుంటే.. ఇక్కడ తెలుగు నుంచి కొంతమంది అదే పనిగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. ముఖ్యంగా ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి.

ట్రైలర్ బాలేదంటే ఆ మేరకు విమర్శలు చేయొచ్చు. నచ్చని వాళ్లు నచ్చలేదని చెప్పుకుంటారు. నచ్చిన వాళ్లూ చెప్పుకుంటారు. అది కాదని అతనిపై వ్యక్తిగత దాడి జరుగుతోంది. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఎన్టీఆర్ పై ట్రోలింగ్ మొదలైంది. అదీ దేవర మూవీతోనే. దీని వెనక ఎవరు ఉన్నారు అనేది రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఉండేవారికి స్పష్టంగా అర్థం అవుతుంది. మరి ఆ హీరోల అభిమానులకు ఎందుకు ఎన్టీఆర్ అంటే అంత ద్వేషం అనేదే చాలామందికి అర్థం కావడం లేదు. పైగా ఆ హీరోలతో ఎన్టీఆర్ బాండింగ్ చాలా స్ట్రాంగ్ అని ఓపెన్ గానే అందరికీ తెలుసు. అయినా దేవర వస్తోందంటే ఆ ఫ్యాన్స్ లో ఉలుకెందుకు..? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.

నిజానికి ప్రస్తుతం ఎన్టీఆర్ పై జరుగుతోన్న ట్రోలింగ్ వెనక తెలుగు దేశం అభిమానులున్నారు అనే అపోహ కొందరిలో ఉంది. బట్.. వారికి ప్రేమించడమే తెలుసు కానీ... ఇలా ఇంటి వాడిని ద్వేషించడం తెలియదు. మహా అయితే ఓ రెండు మాటలంటారేమో కానీ.. ఇలా అదే పనిగా పదే పదే సోషల్ మీడియాలో బురద జల్లడం మాత్రం టిడిపి అభిమానులు చేయరు. ఎందుకంటే ఇతను వాళ్లు పెంచి పోషించిన టాప్ స్టార్. అలాంటి వాడిని కిందకి నెడతారా.. ఛాన్సే లేదు. అందుకే అసలెవరా అని ఆరాలు తీస్తే ఎవరికైనా ఎవరు అనేది సులువుగానే తెలిసిపోతుంది.

ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ పై ట్రోలింగ్ మొదలైంది. దేవర టైమ్ కు పీక్స్ కు చేరింది. ఒకవేళ సినిమాకు హిట్ టాక్ వచ్చినా.. వీళ్లు ఫ్లాప్ గానే ప్రచారం చేస్తారు. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఫేక్ కలెక్షన్స్ అంటారు. బట్ ఆడియన్స్ కు అన్నీ తెలుసు. సినిమా బావుంటే చాలు. ఇవన్నీ గాలికి కొట్టుకుపోతాయి. వీళ్లంతా చెత్త బుట్ట బ్యాచ్ అని తేలిపోతుంది. దేవరకు బ్లాక్ బస్టర్ వస్తే చాలా రికార్డులే క్రియేట్ అవుతాయని వేరే చెప్పక్కర్లేదు. అదే కొందరిలో కనిపిస్తోన్న భయం అనే మాటలూ వినిపిస్తున్నాయి అదే సోషల్ మీడియాలో. ఏదేమైనా వీళ్లు కొట్టుకు చస్తున్నారు కానీ.. మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఆ హీరోలంతా కంగ్రాట్స్ చెప్పుకుంటారు.. కలిసి పార్టీలూ చేసుకుంటారు. మధ్యలో మట్టి కొట్టుకుపోయేది ఈ అతినా... అభిమానులే అనేది వాస్తవం అంటున్నారు .. ఈ తతంగం అంతా చూస్తున్న వాళ్లు.

Tags

Next Story