సినిమా

Samantha Tirumala : సమంత తిరుమల టూర్‌‌‌లో పక్కన ఎవరీమే.. సామ్‌‌‌కు ఆమంటే ఎందుకంత ప్రత్యేకం.. ?

Samantha Tirumala : సినీ నటి సమంత ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె మొదటిసారి సన్నిహితులతో కలిసి తిరుమలకు వచ్చారు.

Samantha Tirumala : సమంత తిరుమల టూర్‌‌‌లో పక్కన ఎవరీమే.. సామ్‌‌‌కు ఆమంటే ఎందుకంత ప్రత్యేకం.. ?
X

Samantha Tirumala : సినీ నటి సమంత ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె మొదటిసారి సన్నిహితులతో కలిసి తిరుమలకు వచ్చారు. సామాన్య భక్తులతో కలిసి ఆమె మహాలఘులో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సమంత సినిమాలు రిలీజ్‌‌కి సిద్దంగా ఉన్నప్పుడు తిరుమలని సందర్శించుకుంటుంది.

గతంలో మజిలి చిత్రం రిలీజ్ అయ్యే మూడు రోజుల ముందు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే సమంత ప్రధానపాత్రలో వచ్చిన ఓ బేబీ సినిమా రిలీజ్‌‌కి నాలుగు రోజుల ముందు ఆమె శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఇప్పుడు బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌‌‌లో వస్తోన్న పుష్ప సినిమాలో సామ్ ఐటెం సాంగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఈ నెల(డిసెంబర్ 17)న రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈ క్రమంలో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్టుగా తెలుస్తోంది.

సమంతతో పాటుగా ఆమె స్నేహితురాలు శిల్పారెడ్డి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శిల్పారెడ్డి ఎవరో కాదు.. సమంత ఫ్యాషన్ డిజైనర్.. సమంతతో ఆమెకి చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. చైతూతో విడాకుల తర్వాత సామ్ చేసిన పనుల్లో ఆమె దగ్గరగా ఉంటున్నారు. ఓ రెండు నెలల క్రితం సామ్ అనేక టూర్స్‌‌‌కి వెళ్లారు. ఆ టూర్లో సామ్ తో పాటుగా శిల్పారెడ్డి కూడా ఉన్నారు.

శిల్పాకి సామ్ ఎంతో విలువ ఇస్తారట.. ముఖ్యంగా కీలకమైన విషయాల్లో ఆమె సలహాలు తీసుకుంటారట. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శాకుంతలం అనే సినిమాని ఫినిష్ చేసింది సామ్.. ఇప్పుడు యశోదతో పాటుగా పలు సినిమాలతో బిజీగా ఉంది.

Next Story

RELATED STORIES