NTR : ఎన్టీఆర్ చెప్పిన హరి ఎవరు?

ఈమధ్య నందమూరి ఫ్యామిలీ నుండి ఎక్కువగా వినిపిస్తున్న పేరు హరి. అంతే కాదు ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సంబందించిన సోషల్ మీడియా పేజెస్ లో. కేవలం వైరల్ అవడమే కాదు.. చాలా మంది అంటే నందమూరి ఫ్యాన్స్ చాలా మంది హరిపై నెగిటీవ్ కామెంట్స్ చేస్తూ.. ట్రోల్స్ చేస్తున్నారు. దాంతో .. హరిపై జరుగుతున్న నెగిటీవ్ ట్రోల్స్ పై స్వయంగా ఎన్టీఆర్ స్పందించాల్సి వచ్చింది. దాంతో మరోసారి హరి అనే పేరు వైరల్ అవుతోంది. ఇక అప్పటినుండి ఈ హరి ఎవరు? అతని గురించి ఎన్టీఆర్ అంత స్పెషల్ గా చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అనేవి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇంతకీ హరి ఎవరో కాదు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ భార్య స్వాతి సోదరుడు. కళ్యాణ్ రామ్ బావమరిది. హరి పూర్తి పేరు కొసరాజు హరికృష్ణ. ఆయన చాలా కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీతో సంబంధం కలిగి ఉన్నాడు. ఇక హీరో కళ్యాణ్ రామ్ కి బంధువు కావడంతో ఆయనకు సంబందించిన సినిమా వ్యవహారాలు కూడా చూసుకునేవాడు. ఆతరువాత కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ కి సంబందించిన వ్యవహారాలు చూసుకుంటూ వస్తున్నాడు. బింబిసార సినిమాకి ముందు వరకు ఎన్టీఆర్ ఆర్ట్స్ కి నిర్మాతగా కళ్యాణ్ రామ్ పేరు మాత్రమే కనిపించేది. కానీ, బింబిసార నుండి ఎన్టీఆర్ ఆర్ట్స్ కి నిర్మాతగా హరి పేరు కనిపిస్తోంది. తాజాగా వచ్చిన దేవర సినిమాకు కూడా నిర్మాతగా ఉన్నాడు హరి.
నిజానికి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే హరికి చాలా ఇష్టం. ఈ రెండు కుటుంబాలకు సంబందించిన ఏ చిన్న పనైనా హరినే దగ్గరుండి చూసుకునే వాడు. అందుకే హరి అంటే ఎన్టీఆర్ కి చాలా అభిమానం. అందుకే ఎన్టీఆర్ ఆర్ట్స్ లాంటి ప్రస్థుష్టాత్మక సంస్థకు సంబందించిన బాధ్యతలను హరి చేతిలో పెట్టారు కళ్యాణ్ రామ్. ఇక అప్పటినుండి ఎన్టీఆర్ కి ఆయన ఫ్యాన్స్ కి మధ్య దూరం పెరిగింది అనే వార్తలు వైరల్ అయ్యాయి. ఆయనకు సంబంచిన ప్రతీ విషయంలో హరి ఇన్వాల్వ్ అవుతుండటం ఫ్యాన్స్ కి నచ్చలేదు. అందుకే హరిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. అలాగే ఈమధ్య దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ ఫంక్షన్ క్యాన్సిల్ అవడానికి కూడా హరినే కారణం అని ఓపెన్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
అందుకే హరిని ఎన్టీఆర్ టీమ్ నుండి తీసేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ ట్రోల్స్ తీవ్రం కావడంతో తాజాగా ఈ విషయంపై ఫైర్ అయ్యారు ఎన్టీఆర్. ఇటీవల జరిగిన దేవర సక్సెస్ మీట్ లో ఆయన హరి గురించి మాట్లాడారు. హరిని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎవరు ఏమనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కి స్థంభం హరి. నాకు కళ్యాణ్ అన్నకి బలం హరి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నచ్చినవాళ్లు అర్థం చేసుకుంటారు. లేనివారు వదిలేస్తారు. అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో మరోసారి హరి పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఎన్టీఆర్ స్పందన తరువాత అయినా ఆయన ఫ్యాన్స్ ఈ వివాదానికి పులిష్టాప్ పెడతారా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com