ఎవరీ కుమ్మరి దుర్గవ్వ.. 'భీమ్లానాయక్'లో పాట పాడే అవకాశం ఎలా వచ్చింది?

టాలీవుడ్‌లో ఫోక్ సింగర్స్‌ల పేరు ఎక్కువగా వినిపిస్తోంది. చిన్నపెద్దా అనే తేడా లేకుండా అన్నీ సినిమాలలో పాటలు పాడుతున్నారు. ఈ లిస్టులోకి తాజాగా చేరింది కుమ్మరి దుర్గవ్వ.. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తోన్న భీమ్లా నాయక్ సినిమాలో 'అడవి తల్లి' అనే పాట పాడింది దుర్గవ్వ.. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండడంతో పాటుగా మారుమోగుతోంది కూడా.
దుర్గవ్వ పాటకి ప్రతిఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఎవరీ దుర్గవ్వ.. ? దుర్గవ్వది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి.. అమె పెద్దగా చదువుకోలేదు. దుర్గవ్వ భర్త రాజయ్య చాలా ఏళ్ల క్రితమే మరణించాడు. దుర్గవ్వకు కుమార్తె శైలజ, కుమారుడు ప్రభాకర్ ఉన్నారు. దుర్గవ్వది నిరుపేద కుటుంబం కావడంతో పొలం పనులకి వెళ్లి తన కుటుంబాన్ని నడిపించేది. అక్కడే అమెకి పాటలు పాడడం నేర్చుకుంది.
తల్లి టాలెంట్ గుర్తించిన ఆమె కుమార్తె శైలజ..తన తల్లితో పాటలు పాడిస్తూ యూట్యూబ్ అప్‌లోడ్ చేసేది. ఆ పాటలు బాగా హిట్ కావడంతో మంచిర్యాలకు చెందిన పలువురు జానపద కళాకారులు దుర్గవ్వతో పాటలు పాడించారు. ఆ పాటలు పాపులర్ కావడంతో ఆమెకి మరింత ఫేమ్ వచ్చింది.
సిరిసిల్ల చిన్నది, ఉంగురమే.. రంగైనా రాములాల టుంగూరమే మొదలగు పాటలు ప్రజల్లోకి వెళ్ళాయి. మామిడి మౌనిక, సింగర్ మల్లిక్‌తేజ సహకారంతో టాలీవుడ్ లో పాటలు పాడే అవకాశం వచ్చిందని దుర్గవ్వ కూతురు శైలజ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com