Mitraaw Sharma : తెలుగు బిగ్‌బాస్ ఓటీటీ .. ఎవరీ మిత్రావ్ శర్మ?

Mitraaw Sharma : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న తెలుగు బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ శనివారం గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. ఈ ఓటీటీ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 24*7 నాన్ స్టాప్‌గా ఈ షో ప్రసారం అవుతోంది. దిస్ ఈస్ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ అంటూ స్మాల్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన నాగ ఒక్కో కంటెస్టెంట్‌ను పిలుస్తూ ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
అందులో భాగంగానే 11వ కంటెస్టెంట్‌గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మిత్రావ్ శర్మ.. దీనితో ఈ అమ్మాయి ఎవరని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. 26 మే 1995న కేరళలో జన్మించింది మిత్రావ్ శర్మ.. చదువు పూర్తి అయ్యాక నటనపై ఉన్న మక్కువ కారణంగా మోడలింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత నటిగా మారింది.
భాగ్యవిధాత అనే హిందీ సీరియల్ లో మొదటిసారి నటించింది. 'తొలి సంధ్య వేళలో' సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత సొంతంగా శ్రీ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి.. బాయ్స్ సినిమాని నిర్మిస్తోంది. ఈమెకి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com