RRR trailer: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎవరు హీరో, ఎవరు విలన్? ట్రైలర్‌ను బట్టి చూస్తే..

RRR trailer (tv5news.in)
RRR trailer: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ట్రైలర్ విడుదల కావడమే పెద్ద బ్లాస్‌గా రిలీజ్ అయ్యింది. అటు ఎన్‌టీఆర్ ఫ్యాన్స్, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ గురించి మాట్లాడుకునేలా చేశారు రాజమౌళి. ఇన్ని సంవత్సరాలు సినిమా ఎవరైనా తెరకెక్కిస్తారా.. అనే దగ్గర నుండి ఇలాంటి సినిమా తీయాలంటే ఈ మాత్రం సమయం పడుతుంది అనుకునేంత వరకు చేశారు.
మొత్తంగా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ మూడు నిమిషాలు ఉంది. మామూలుగా ట్రైలర్ అనేది రెండున్నర నిమిషాలకంటే ఎక్కువ ఉండదు. కానీ ఆర్ఆర్ఆర్ కంటెంట్ పరంగా చూస్తే.. ట్రైలర్ నిడివిని తగ్గించలేం అనుకున్న మూవీ టీమ్.. మూడు నిమిషాల పైన ట్రైలర్‌నే ప్రేక్షకుల ముందు పెట్టింది. ఆ విజువల్స్‌ను చూస్తూ.. ప్రేక్షకులు కూడా టైమింగ్‌ను మర్చిపోయారు.
ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌లో చూసినదాని ప్రకారం, ఇప్పటివరకు మూవీ యూనిట్ సినిమా గురించి చెప్పినదాని ప్రకారం ఇది ఒక పీరియాడికల్ డ్రామా. అయితే ట్రైలర్‌లో ముందుగా ఎన్‌టీఆర్, రామ్ చరణ్ మంచి స్నేహితులుగా ఉన్నా.. తరువాత వీరి మధ్య కూడా ఫైట్స్ జరగనున్నాయని అర్థమవుతోంది. అయితే ఫైట్ అంటే మామూలుగా ఒక హీరో, ఒక విలన్ ఉండాల్సిందే. మరి ఇందులో హీరో ఎవరు, విలన్ ఎవరు అన్న సందేహంలో ప్రేక్షకుల్లో మొదలయిపోయింది.
ఆర్ఆర్ఆర్‌లో బ్రిటిష్ కాలంలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో రామ్ చరణ్ కనిపించనున్నట్టుగా అర్థమవుతోంది. ఆ బ్రిటీష్ వారిని ఎదిరించే పాత్రలో ఎన్‌టీఆర్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్‌లో చూసినదాన్ని ప్రకారం ముందుగా రామ్ చరణ్ బ్రిటీష్ వారికోసం పనిచేసినా.. చివరికి మారిపోయి ఎన్‌టీఆర్‌తో కలిసి వారిని మట్టుపెడతాడు. ఇదంతా చూసిన తర్వాత ఎవరు హీరో, ఎవరు విలన్ అనే ప్రశ్న మరింత బలంగా మారింది. ఈ ప్రశ్నకు సమాధానం జనవరి 12న థియేటర్లలోనే దొరుకుతుంది అనుకుంటున్నారు ఫ్యాన్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com