Bigg Boss Season 9 : బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ ఎవరు..?

బిగ్ బాస్ అనగానే చాలామంది ఎంటర్టైనింగ్ గానే చూస్తారు. కొందరు విమర్శలు గుప్పిస్తారు. అయినా ఆ టైమ్ కు వచ్చేసరికి టివిల ముందు కూర్చుని ఎవరు బాగా ఆడుతున్నారు. ఎవరు కన్నింగ్.. ఎవరు విన్నింగ్ గేమ్ ఆడుతున్నారు అని విశ్లేషణలు చేస్తుంటారు. ఇక వీకెండ్ వచ్చిందటే హోస్ట్ ఎవరికి ఎన్ని అక్షింతలు వేశాడు. ఎవరిని పొగుడుతున్నాడు.. అలా చేయడం కరెక్టేనా అనే డిష్కషన్స్ నడుస్తుంటాయి. అయితే ఈ మొత్తం షోక కంటెస్టెంట్స్ కంటే హోస్ట్ దే కీలక పాత్ర. అందుకే స్టార్స్ ను తీసుకుంటారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 ను ఎన్టీఆర్ తో చేయించారు. అది మోస్ట్ ఎంటర్టైనింగ్ అనిపించుకుంది. తర్వాత నానిని తీసుకువచ్చారు. బట్ నాని తేలిపోయాడు. ఆ తర్వాత వచ్చిన నాగార్జున సీజన్ 8 వరకూ కొనసాగాడు.
కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ సీజన్ 9 ను నందమూరి బాలకృష్ణతో చేయించబోతున్నారు అనే టాక్ వినిపించింది. ఆయన తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో చేసిన అన్ స్టాపబుల్ సూపర్ సక్సెస్ కావడంతో బాలయ్య అయితే బిగ్ బాస్ హౌస్ మరింత రసవత్తరంగా ఉంటుంది.. ఆయన స్టైల్లో అదరగొడతారు అనుకున్నారు. దీంతో చాలా మంది బాలయ్యే సీజన్ 9 హోస్ట్ అని ఫిక్స్ అయ్యారు. బట్ ఇందులో నిజమేం లేదు.
ఈ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతోన్న బిగ్ బాస్ ను ఈ సారి కూడా నాగార్జుననే హోస్ట్ చేయబోతున్నాడట. నాగ్ అయితేనే సెట్ అవుతుందనుకుంటున్నారు. నాగ్ కూడా ఎపిసోడ్ ఎపిసోడ్ కు నెక్ట్స్ లెవల్లో కనిపిస్తున్నాడు. లాస్ట్ సీజన్ లో శివాజీ లాంటి నటుడిని కూడా ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. అదే టైమ్ పొగడ్తలూ కురిపించాడు. సో.. బాలయ్య హోస్ట్ అనేది ప్రస్తుతానికి లేదు. ఈసారి కింగే హౌస్ ను రూల్ చేయబోతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com