Daku Maharaaj : సంక్రాంతి విన్నర్ ఎవరో..?

టాలీవుడ్ బిగ్ సీజన్స్ లో ఒకటైన సంక్రాంతి పోటీకి అంతా సిద్ధమైంది. ప్రధానంగా మూడు సినిమాలు పోటీలో ఉన్నాయి. మూడూ డిఫరెంట్ జానర్స్. ఒక్కో సినిమాకు ఒక గ్యాప్ లో మూడు సినిమాలు రాబోతున్నాయి. జనవరి 10న గేమ్ ఛేంజర్, 12న డాకూ మహరాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ వస్తున్నాయి. మరి ఈ మూడు సినిమాల్లో సాలిడ్ బాక్సాఫీస్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఎక్కువగా ఉంది. ఎవరు బ్లాక్ బస్టర్స్ తో ప్రొడ్యూసర్స్ అకౌంట్స్ లో కాసులు కురిపించబోతున్నారు అనేది చూద్దాం.
జనవరి 10న వస్తోన్న గేమ్ ఛేంజర్ .. టీజర్ లో చెప్పినట్టు రిజల్ట్ అన్ ప్రిడక్టబుల్ అనుకున్నారు చాలామంది. బట్ ట్రైలర్ తర్వాత ప్రిడక్టబుల్ అన్నారు ఆడియన్స్. ట్రైలర్ కు ముందు వరకూ గేమ్ ఛేంజర్ పై పెద్దగా అంచనాలు లేవు. ప్రధానంగా శంకర్ భారతీయుడు 2 డిజాస్టర్ అయి ఉండటం ఈ మూవీపై ఎక్కువ ప్రభావం చూపించింది. దీనికి తోడు బాగా లేట్ కావడం.. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోవడం వంటి కారణాలతో గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద కష్టం అనుకున్నారు. కానీ ట్రైలర్ కు ముందు భారీ కటౌట్ ఈవెంట్, ట్రైలర్ ఈవెంట్ సినిమా కలర్ ను మార్చేశాయి. ఓ బ్లాక్ బస్టర్ పడబోతోంది అనే ఫీల్ ను తెచ్చాయి. కియారా కంటే అంజలికి ఎక్కువ మార్కులు పడబోతున్నాయని తేలిపోయింది. అలాగే అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడనీ, చరణ్, సూర్య మధ్య సన్నివేశాలు మాస్ తో విజిల్స్ కొట్టిస్తాయని చెబుతున్నారు. మొత్తంగా గేమ్ ఛేంజర్ ప్యాన్ ఇండియా స్థాయిలో ఎలా ఉన్నా ఇక్కడ గ్యారెంటీ హిట్ అనేస్తున్నారు.
12న వస్తోన్న డాకూ మహరాజ్ పై ఎవరికీ ఏ డౌట్ లేదు. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతున్నాడు అనే టాక్ ముందు నుంచీ ఉంది. టీజర్ కే ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కొందరికి యావరేజ్ అనిపించినా.. దర్శకుడు బాబీ తెలివిగా అంచనాలను కంట్రోల్ లో ఉంచేందుకే ఇలా కట్ చేశాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. ట్రైలర్ లో ప్రొఫైల్ లో ఉండి.. సినిమా హై ఓల్టేజ్ తో కనిపిస్తే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూ ఓ సర్ ప్రైజ్ ఉంటుందని.. అది సినిమా రేంజ్ ను థియేటర్స్ నుంచి మార్చేస్తుందనే నమ్మకంతోనే అలా చేశారట. థమన్ మ్యూజిక్ మరో హైలెట్ గా నిలవబోతోందని ట్రైలర్ తోనే తేలిపోయింది. పాటలూ బావున్నాయి. బాలయ్య రెండు గెటప్పులూ అద్భుతంగా సెట్ అయ్యాయి. సో.. సంక్రాంతికి సాలిడ్ బ్లాక్ బస్టర్ గా డాకూ మహరాజ్ జెండా ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది.
సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకటేష్, అనిల్ రావిపూడి రాబోతున్నారు. టైటిల్ కు తగ్గ సీజన్ వీరికి పెద్ద ప్లస్ కాబోతోంది. ట్రైలర్ లో మరీ ఫన్ ఆఫర్ చేయలేదు అనిపించింది. కాకపోతే వీళ్లు ఈ సారి కంటెంట్ కంటే సీజన్ ను ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. అంటే సినిమాలో బలమైన కథ, కథనాలు లేకపోయినా.. పండగ సందర్భంగా సరదాగా కాసేపు చూసేలా ఉంటే చాలు పాసైపోతాం అనే భావనలోనే ఉన్నారనే టాక్ ఉంది. అనిల్ రావిపూడి డైరెక్టర్ గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ల సపోర్టింగ్ రోల్స్ కు వెంకటేష్ టైమింగ్ ను ఎక్కువగా నమ్ముకున్నాడనే కమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ సినిమా సంక్రాంతి పరీక్షలో ఈజీగా పాసైపోతుందంటున్నారు.
మొత్తంగా ఈ మూడు సినిమాలకు ఏపిలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి వచ్చింది. తెలంగాణలో ఇంకా రాలేదు. రాకపోతే ఓపెనింగ్ డే వసూళ్లపై పెద్ద ప్రభావమే పడుతుంది.
ఇక ఎలా చూసినా సంక్రాంతి బరిలో నిలిచిన మూడు సినిమాల్లో అసలు సిసలైన విజేత బాలయ్యే కాబోతున్నాడనేది మాత్రం ఇండస్ట్రీలో కూడా బలంగా వినిపిస్తోంది. పైగా ఆయనకు సంక్రాంతి అంటే బాగా కలిసొచ్చిన సీజన్ కదా. ఆ సెంటిమెంట్ మరోసారి రిపీట్ కాబోతోందంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com