Mahesh Babu : రీ రిలీజ్ లలో టాప్ హీరో ఎవరు..?

Mahesh Babu :  రీ రిలీజ్ లలో టాప్ హీరో ఎవరు..?
X

రీ రిలీజ్ ల ట్రెండ్ మొదలైన దగ్గర నుంచి స్టార్ హీరోల బ్లాక్ బస్టర్స్ అన్నీ వరుసగా వస్తున్నాయి. ఈ రీ రిలీజ్ లు రికార్డులు క్రియేట్ చేయడం.. ఫస్ట్ డే కలెక్షన్స్ లో టాప్ ప్లేస్ లో ఉంచడం వంటివన్నీ ఫ్యాన్స్ తమ బాధ్యతగా తీసుకుని మరీ చేస్తున్నారు. మామూలుగా అయితే ఓల్డ్ మూవీస్ రీ రిలీజ్ అయితే చూడ్డానికి అందరికీ నచ్చుతుంది. ఎప్పుడైతే ఫ్యానిజం ఎంటర్ అయిందో.. అప్పటి నుంచి మరో హీరో మంచి సినిమాలు కూడా ఇతర హీరోల అభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు అనేది వాస్తవం. సరే.. ఫ్యాన్స్ మధ్య ఈ వార్స్ ఎప్పటి నుంచో ఉన్నవే. ఇక ఇప్పుడు తెలుగులో రీ రిలీజ్ లతో రికార్డులు నెలకొల్పిన హీరోలు ఎవరు..? ఏ హీరో ఎంత కలెక్షన్స్ తో ఏ ప్లేస్ లో ఉన్నాడు అనేది చూస్తే.. అందుకోసం టాప్ ఫైవ్ అనే నంబర్ అనుకుంటే.. ఈ ఫైవ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నది పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ లో 7.54 కోట్ల వసూలుతో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ టాప్ ప్లేస్ లో ఉంది. ఇక ఆ తర్వాత నుంచి వరుసగా మూడు స్థానాల్లో ఉన్న హీరో మహేష్ బాబు కావడం విశేషం. యస్.. సూపర్ స్టార్ మహేష్ బాబు రీ రిలీజ్ ల ట్రెండ్ లో ఈ రికార్డ్ క్రియేట్ చేశాడు.

మామూలుగా రీ రిలీజ్ అంటే బ్లాక్ బస్టర్ మూవీస్ ను ఎంచుకుంటారు. ఒక్క మహేష్ బాబు నుంచి మాత్రం ఖలేజా లాంటి యావరేజ్ సినిమాను కూడా రీ రిలీజ్ చేశారు. అదే ఇప్పుడు ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో సెకండ్ ప్లేస్ లో నిలవడం విశేషం. యస్.. ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 6.85 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మహేష్ మూవీసే అయిన మురారి 5.41 కోట్లు, బిజినెస్ మేన్ 5.27 కోట్లు వసూళ్లతో రెండు స్థానాల్లో నిలిచాయి. అంటే గబ్బర్ సింగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే.. సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేస్ లలో మహేష్ బాబు సినిమాలున్నాయి. ఐదో స్థానంలో మళ్లీ పవన్ కళ్యాణ్ ఖుషీ ఉంది. సో.. రీ రిలీజ్ లలో మహేష్ బాబు సత్తా వేరేగా ఉందని చెప్పాలి.

విశేషం ఏంటంటే.. సౌత్ మొత్తంలో చూసుకుంటే ఈ టాప్ ప్లేస్ లో తమిళ్ స్టార్ ఇళయదళపతి విజయ్ ఉన్నాడు. అతను నటించిన గిల్లి మూవీ మొదటి రోజు 7.92 కోట్లు వసూలు చేసింది. టోటల్ రన్ లో కూడా మొత్తం సౌత్ లో గిల్లిదే టాప్ ప్లేస్ కావడం మరో విశేషం.

Tags

Next Story