RRR Movie : RRR సినిమాని ముందుకు నడిపించిన ఈ మల్లి ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?

RRR Movie : ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఇప్పుడు RRR హవా నడుస్తోంది. బాహుబలి మూవీ తర్వాత టాలీవుడ్ జక్కన్న డైరెక్షన్‌లో వచ్చిన మూవీ కావడం, చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించడంతో ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మారధం పడుతున్నారు.. ఎక్కడ చూసిన సినిమాకి హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. చరణ్, ఎన్టీఆర్‌ల నటనకి మాత్రమే కాకుండా సినిమాలో చాలా పాత్రలకి పేరొచ్చింది. అందులో ఒకటి మల్లి పాత్ర.
సినిమా మొదలవ్వడమే మల్లి పాత్రతోనే మొదలవుతుంది. గిరిజన బిడ్డైన మల్లిని బ్రిటిష్ దొరసాని తనతోని ఢిల్లీకి తోలుకొనిపోవడం, ఆమె కోసం భీమ్(ఎన్టీఆర్) ఢిల్లీకి రావడం, భీమ్‌కి అక్కడ రాజు(చరణ్) కలవడం.. ఇద్దరు కలిసి బ్రిటిష్ వాళ్ళ పై యుద్ధం చేసి వారిని అంతం చేయడం జరుగుతుంది. సినిమాకి మెయిన్ పిల్లర్ అయిన మల్లి పాత్రను పోషించిన ఆ అమ్మాయి పేరు ట్వింకిల్ శర్మ. అమెది చండీగఢ్.
RRR మూవీ మొదలైనప్పుడు ఆమె ఎనిమిదో తరగతి చదివేది.. ఇప్పుడు పదో తరగతి చదువుతోంది. ఈ సినిమాతో ఫుల్ ఫేమ్ సంపాదించుకున్న ట్వింకిల్ అంతకు ముందు డాన్స్ ఇండియా డాన్స్ అనే కాంపిటీషన్‌లో పాల్గొంది. ఎన్నో టీవీ షోస్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్రకటనలలో కూడా నటించింది. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రకటనలో ఆమెను చూసిన రాజమౌళి ఆమెను ఆడిషన్‌కి రమ్మన్నారు.. చండీగఢ్ నుంచి హైదరాబాద్‌కు విమాన టిక్కెట్లు కూడా రాజమౌళినే బుక్ చేశారు.
ట్వింకిల్‌కి తమిళ భాషలో స్క్రిప్ట్‌ను అందించి, ఆ భాషలో ఆడిషన్‌కు రమ్మని అడిగారు. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ సహాయంతో తమిళ భాషలోనే ఆడిషన్ చేసింది ట్వింకిల్.. ఆమె నటనకి ముగ్దుడైన జక్కన్న.. మల్లి పాత్రకి ఆమెని ఫైనల్ చేశాడు.. ఈ పాత్ర కోసం ఏకంగా 160 మందిని ఆడిషన్ చేశాడు జకన్న.. చివరగా మల్లి పాత్ర ట్వింకిల్‌ని వరించింది. సినిమాలో ఆమె నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com