Kundara Johny : కార్డియాక్ అరెస్ట్‌తో మలయాళ నటుడు మృతి
మలయాళ చిత్రాల్లో నెగిటివ్ క్యారెక్టర్లను ప్రభావవంతంగా పోషించిన ప్రముఖ నటుడు కుందర జానీ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన తుది శ్వాస విడిచినట్లు ఫెఫ్కా డైరెక్టర్స్ యూనియన్ తెలిపింది. ఆయన వయసు 71. కాగా అక్టోబర్ 17న సాయంత్రం గుండెపోటు రావడంతో జానీని ఆసుపత్రికి తరలించినట్లు యూనియన్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది.
కుందర జానీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్.. జానీ తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో 500 కంటే ఎక్కువ చిత్రాలలో నటించాడని చెప్పారు. కడపకాడ స్పోర్ట్స్ క్లబ్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. గురువారం సెయింట్ ఆంటోనీ చర్చి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కుందర జానీ డైస్: తెలుసుకోవలసిన 5 విషయాలు
- జానీ తన 23వ ఏట, 1979లో మలయాళం చిత్రం, 'నిత్య వసంతం'లో 55 ఏళ్ల పాత్రను పోషించాడు.
- అతను మలయాళ చిత్రాలలో విలన్ పాత్రలు పోషించినందుకు ప్రశంసలు పొందాడు. ముఖ్యంగా ఆయన నటించిన వాటిలో 'కిరీడం', 'చెంకోల్' బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. 2022లో విడుదలైన 'మెప్పడియాన్' అతని చివరి సినిమా.
- జానీ వాస్తవానికి కొల్లాం జిల్లాలోని కుందర ప్రాంతానికి చెందినవాడు. అతను జోసెఫ్, కేథరీన్‌లకు జన్మించాడు.
- తన విద్యాభ్యాసం కోసం, అతను కొల్లంలోని ఫాతిమా మాతా కళాశాల, శ్రీ నారాయణ కళాశాలలో చదివాడు. కాలేజీ రోజుల్లో కొల్లాం జిల్లా ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా గౌరవం దక్కింది.
- కొల్లాంలోని ఒక కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భార్య స్టెల్లాతో ఆయన కలిసి ఉంటున్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com