Allu Arjun : హిందీలో పుష్ప 2ను కొట్టే మొనగాడెవరు..?

Allu Arjun :  హిందీలో పుష్ప 2ను కొట్టే మొనగాడెవరు..?
X

హిందీ మార్కెట్ ను ఇప్పుడు పూర్తిగా సౌత్ మేకర్స్ ఆక్రమించారు. మనవాళ్లే అక్కడి బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నారు. ఈ యేడాది బాలీవుడ్ నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ అని కాస్త గట్టిగా చెప్పుకున్న ఏకైక సినిమా ‘స్త్రీ 2’ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. కొన్ని హిట్స్ ఉన్నాయి. కానీ వాళ్లు టాక్ ఆఫ్ ద బాలీవుడ్ అని చెప్పుకున్నది మాత్రం స్త్రీ 2 గురించే. ఈ మూవీ హిందీ మార్కెట్ లో సాధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ ను రికార్డ్ గా చెప్పుకున్నారు.. ఈ యేడాది. స్త్రీ 2 మొదటి రోజు 65 కోట్లు వసూళ్లు సాధించింది. అంతకు ముందు జవాన్ 68 కోట్లు వసూలు చేసి ఇప్పటి వరకూ హిందీలో హయ్యొస్ట్ ఓపెనర్ గా ఉంది. ఆ రికార్డ్ ను పుష్ప 2 బ్రేక్ చేసింది. పుష్ప 2 ఫస్ట్ డే 72 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఇదే పెద్ద సవాల్ అనుకుంటే ఇప్పుడు ఏకంగా మరో పెద్ద సవాల్ విసిరాడు అల్లు అర్జున్.

పుష్ప 2 ఫస్ట్ డే 72 కోట్లు అయితే రెండో రోజు 59 కోట్లు వచ్చాయి. దీంతో ఇక ఈ ఫిగర్స్ ఇంకా డౌన్ అవుతాయి అనుకున్నారు. బట్ మూడో రోజు 74 కోట్లు నాలుగో రోజైన ఆదివారం ఏకంగా 86 కోట్లు వచ్చాయి. అంటే ఒక సౌత్ హీరో సినిమా వరుసగా ఒక్కో రోజుతో నెక్ట్స్ లెవల్ కు వెళ్లిపోయింది. ఈ నాలుగు రోజుల్లో కలిపి పుష్పరాజ్ సాధించిన కలెక్షన్స్ 291 కోట్లు. ఇది రీసెంట్ గా వచ్చిన సింగం అగెయిన్ ఓవరాల్ కలెక్షన్స్ కు దాదాపు దగ్గరగా ఉన్న ఫిగర్స్. ఓ రకంగా అల్లు అర్జున్ క్రియేట్ చేసిన రికార్డ్ ను బ్రేక్ చేసే సత్తా బాలీవుడ్ కు ఇప్పట్లో లేదు అనే చెప్పాలి. అలాగే సౌత్ నుంచి అదే స్థాయిలో మరో హీరో సాధించే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయి. ఒకవేళ బ్రేక్ అయితే అది కూడా మళ్లీ రాజమౌళి లేదా ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతోనే సాధ్యం అవుతుంది.

ఒకప్పుడు సౌత్ సినిమాన పరిగణలోకి కూడా తీసుకోని బాలీవుడ్ ఇప్పుడు మన సినిమా హవాకు గింగిరాలు తిరిగిపోతోందనే చెప్పాలి. విశేషం ఏంటంటే.. అక్కడి క్రిటిక్స్ కూడా సౌత్ సినిమా బాలీవుడ్ ను రూల్ చేస్తోన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఆ మేకర్స్ ఆలోచించాలి అని సలహాలు ఇస్తున్నారు.

Tags

Next Story