కుటుంబం మొత్తం ఒకే గదిలో.. డబ్బు లేకపోయినా సంతోషంగా: అక్షయ్ కుమార్
ఇప్పుడంటే డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కానీ తన చిన్నప్పుడు తన కుటుంబం ఎన్ని కష్టాలు పడేదో వివరించాడు ఓ ఇంటర్వ్యులో అక్షయ్ కుమార్.. డిసిప్లెయిన్ కి మారు పేరుగా ఉండే అక్షయ్ రెండు దశాబ్ధాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండి ఇప్పటికీ ఏడాదికి రెండు మూడు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకాదరణను చూరగొంటున్నాడు.
ఢిల్లీలోని చాందినీ చౌక్‌లోని ఒకే గదిలో కుటుంబం మొత్తం ఎలా జీవించేదో వివరించాడు. 7వ తరగతిలో ఫెయిల్ అవడంతో తండ్రి ఆగ్రహంతో కొట్టడానికి రావడంతో ఆయనకు దొరక్కుండా పరుగులు తీశానని చెప్పాడు. కోపంతో ఉన్న తండ్రి అక్షయ్‌కు చదువుపై అస్సలు ఆసక్తి లేదని గ్రహించి, మరేం చేయాలనుకుంటున్నావని అడిగాడు అక్షయ్ ని. ఆక్షణంలో అక్షయ్ ఏమీ ఆలోచించకుండా, తనకు నటుడిని కావాలనుందని బదులిచ్చాడు. అయితే, ఈ సమయంలో అతనికి నటుడిగా మారాలనే ఆలోచన లేదు. మార్షల్ ఆర్ట్స్ టీచర్ కావాలన్నది అతని కల.
ఢిల్లీలోని తన కుటుంబంలో 24 మంది ఉన్నారని, కుటుంబం మొత్తం ఒకే గదిలో నివసించారని అక్షయ్ తెలిపారు. అంత డబ్బు లేదు, అయినప్పటికీ అందరూ సంతోషంగా జీవించారు. తనకు నటుడిని కావాలనే కోరిక లేకపోయినా, సినిమాలంటే చాలా ఇష్టమని అక్షయ్ చెప్పాడు. ముంబైలో తాము నివసించే ప్రాంతానికి సమీపంలోనే రూపమ్ సినిమా హాల్ ఉండేది. ప్రతి శనివారం తన సోదరితో కలిసి సినిమా చూడటానికి వెళ్లేవాడు. అయితే, దీని కోసం పగటిపూట ఆహారం తీసుకోకుండా ఆదా చేసిన డబ్బుతో ఇద్దరూ టిక్కెట్లు కొని సినిమా చూసేవారు. ఆ సమయంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలూ చూశానని చెప్పాడు.
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఉన్నా మధ్యతరగతి కుటుంబం దానిని భరించడం కష్టం. ఆ సమయంలో, బ్యాంకాక్ భారతదేశానికి సమీపంలో ఉన్న అత్యంత చౌకైన దేశం, కాబట్టి అతని తండ్రి అక్షయ్‌ను యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి అక్కడికి పంపాడు. ఇండియా నుంచి బ్యాంకాక్ వెళ్లేందుకు అప్పట్లో టికెట్ రూ.22వేలు కాగా, అతని కుటుంబం వద్ద అంత డబ్బు లేదు. అలాంటి పరిస్థితుల్లో తండ్రి రూ.18వేలు అప్పు తీసుకుని అక్షయ్‌కి బ్యాంకాక్ వెళ్లేందుకు టికెట్ కొని పంపించారు.
అక్షయ్ వెయిటర్‌గా పని చేయడానికి ముంబైకి తిరిగి వచ్చాడు, అయితే అదృష్టవశాత్తూ అతనికి సినిమాల్లో పనిచేసే అవకాశం వచ్చింది. అంతకు ముందు కొంత కాలం మోడలింగ్ రంగంలో కూడా పని చేశాడు. 1991 సౌగంధ్ సినిమాతో అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరంలో అక్షయ్ మరో చిత్రం డాన్సర్ కూడా రిలీజ్ అయ్యింది. 1992లో, అతడు నటించిన 3 చిత్రాలు ఖిలాడీ, మిస్టర్ బాండ్, దీదార్ విడుదలయ్యాయి. 1993లో 5 సినిమాలు, 1994లో 11 సినిమాల్లో నటించాడు. ఒకే ఏడాది 11 సినిమాల్లో నటించాడంటే అప్పట్లో అక్షయ్ క్రేజ్ ఎంతగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుండి నేటి వరకు అక్షయ్ కుమార్ ప్రతి సంవత్సరం కనీసం 3 చిత్రాలకు తక్కువ కాకుండా నటిస్తున్నాడు. తన 32 ఏళ్ల కెరీర్‌లో అక్షయ్ కుమార్ 132 సినిమాల్లో నటించారు. తన తల్లి తాను నటించిన ప్రతి సినిమాను కనీసం ౭ సార్లు చూస్తుందని చెప్పాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com