Harsha Sai : నిన్న జానీ మాస్టర్, నేడు హర్ష సాయి.. నెక్ట్స్ ఎవరు..?

టాలీవుడ్ లో వరుస సంచలనాలు కనిపిస్తున్నాయి. రీసెంట్ గా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మైనర్ ను రేప్ చేసిన ఘటనలో అరెస్ట్ అయ్యాడు. అలాగే ఆ అమ్మాయిని ఇతర కారణాలతోనూ వేధించాడనే కేస్ లు ఉన్నాయి. కేస్ సెన్సిటివ్.. కోర్ట్ పరిధిలో ఉంది కాబట్టి ఎవరూ పెద్దగా కామెంట్ చేయలేదు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే అనే సింపుల్ స్టేట్మెంట్స్ తో వదిలేశారు. ఆ కేస్ ఇంకా మరుగున పడనేలేదు అప్పుడే మరోటి వచ్చింది.
యూ ట్యూబర్ గా హల్చల్ చేస్తూ అందరికీ డబ్బులు పంచుతున్న కలరింగ్ ఇస్తూ తనను తాను ఓ కరుణామయుడుగా ప్రొజెక్ట్ చేసుకున్న హర్ష సాయిపైనా రేప్ కేస్ నమోదైంది. అతను బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ విపరీతంగా సంపాదించాడు అంటారు. ఆ యాప్స్ వల్ల ఎంతోమంది కోట్లు పోగొట్టుకున్నారు. అది వేరే విషయం. ఇక తనకు వచ్చిన క్రేజ్ ను చూసి జనం జేజేలు కొడతారని సినిమా హీరో అయ్యాడు. ఇక్కడే ఓ రాంగ్ స్టెప్ వేశాడు. తన డబ్బు బ్లాక్ మనీ కాబట్టి అది హీరోయిన్ నిర్మాతగా మారిన డబ్బుగా చూపించాడు. ఈ సినిమా రైట్స్ ను తను తీసుకుంటే అప్పుడు ఆ మనీ వైట్ అవుతుంది కదా అనేది అతని స్కెచ్ అంటారు. కానీ ఇతగాడి కోసం డబ్బులు పెట్టి మరీ సినిమా నిర్మిస్తూ హీరోయిన్ గా నటించేంత పిచ్చివాళ్లు ఉన్నారా.. ఆ తెలివిని మనోడు అంచనా వేయలేకపోయాడు. ఆ అమ్మాయి ఇతను అడిగిన సంతకాలు పెట్టను అనేసింది. మరి మధ్యలో ఏమైందో కానీ ఆమెతో మనోడు బాగా రాసుకుపూసుకు తిరిగాడు. దాన్ని ఆమె ‘ఎవిడెన్స్’గా మార్చుకుంది. ఇతను డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో ఎవిడెన్స్ ను బటయకు తీసింది. కేస్ పెట్టేసింది. చట్టానికి వ్యక్తిగత విషయాలు అక్కర్లేదు. సాక్ష్యాలు ఉంటే చాలు. ఉన్నాయి కాబట్టి హర్ష సాయి బుక్ అయ్యాడు. ఆ సాక్ష్యాలు నిజమేనా కాదా అనేది కోర్ట్ తేలుస్తుంది. అప్పటి వరకూ అతను నిందితుడు.
సో.. గతంలో ఎవరెలా ఉన్నా.. అవసరాలు తీరాకో లేక అపార్థాలు మొదలయ్యాకో అవన్నీ రేప్ కేస్ లు, వేధింపుల కేస్ లుగా మారబోతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే టాలీవుడ్ లో ఇంకా చాలామంది ఇలాంటి కేస్ లకు బలి కాబోతున్నారనే భయం మొదలైంది. ఎవరు ఎప్పుడు ఎవరిపై ‘తగిన సాక్ష్యాధారాలతో’ కేస్ పెడతారా అని ఆల్రెడీ అలాంటి వ్యవహారాల్లో ఆరితేరిపోయిన వాళ్లు తెగ భయపడుతున్నారట. మరి ఈ లిస్ట్ లో నెక్ట్స్ వినిపించే పేరు ఎవరిదో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com