సినిమా

Dasari Arun Kumar : దాసరి అరుణ్ కు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది?

Dasari Arun kumar : ముందునుంచి తన చిన్నకుమారుడు అరుణ్ కుమార్‌‌ని హీరోని చేయాలని అనుకున్నారు దాసరి.. అందులో భాగంగానే హీరోగా తన దర్శకత్వంలోనే ఇండస్ట్రీకి పరిచయం చేశారు దాసరి..

Dasari Arun Kumar : దాసరి అరుణ్ కు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది?
X

Dasari Arun kumar : లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. దర్శకుడిగా అత్యధిక సినిమాలు చేసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కారాయన.. కేవలం దర్శకుడిగానే కాకుండా మంచి నటుడుగా, అభిరుచి కలిగిన నిర్మాతగా, పాటల రచయితగా, ఇండస్ట్రీలో విభిన్నమైన శాఖలలో తనదైన ముద్రవేసి తారస్థాయికి చేరుకున్నారు.

అయితే ఇండస్ట్రీలో మామూలు హీరోహీరోయిన్ లను స్టార్ లను చేసిన దాసరి.. తన వారసుడు అరుణ్ కుమార్‌ని మాత్రం స్టార్‌‌ని చేయడంలో విఫలం అయ్యారు. ఇప్పుడు అరుణ్ పై పోలీస్ కేసు నమోదు కావడంతో దాసరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ముందునుంచి తన చిన్నకుమారుడు అరుణ్ కుమార్‌‌ని హీరోని చేయాలని అనుకున్నారు దాసరి.. అందులో భాగంగానే హీరోగా తన దర్శకత్వంలోనే ఇండస్ట్రీకి పరిచయం చేశారు దాసరి.. ఓ హీరోకి ఉండాల్సిన అన్నీ లక్షణాలు అరుణ్‌‌కి ఉన్నప్పటికీ సక్సెస్ కాలేకపోయాడు. కథల ఎంపిక విషయంలో తప్పిదమే అరుణ్ సక్సెస్ కాకపోవడానికి మెయిన్ కారణంగా చెప్పుకోవచ్చు. సామాన్యుడు, చిన్న, ఆదివిష్ణు వంటి పలు సినిమాల్లో అరుణ్ నటించాడు. కొడుకుని ఓ హీరోగా నిలబెట్టలేకపోవడం తనకి బాధగా ఉందని దాసరి కూడా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.దాసరి మరణం తరవాత అరుణ్ కూడా సినిమాల పైన పూర్తిగా ఫోకస్ తగ్గించారు.

ఇక సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చారు అరుణ్.. దాసరి మరణం తర్వాత ఆయన కుమారులైన ప్రభు, అరుణ్ ల మధ్య ఆస్తి వివాదాలు చోటు చేసుకున్నాయి. అరుణ్ తమ ఇంట్లోకి గోడ దూకి అక్రమంగా ప్రవేశించి గొడవ చేశాడని ఆయన అన్న ప్రభు కేసు పెట్టారు. ఇప్పటికీ ఆ కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి.

తాజాగా మద్యం మత్తులో కారును అతివేగంగా నడపడంతో బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో దాసరి అరుణ్‌ పై కేసు నమోదు కావడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో దాసరి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండి.. ఎంతోమందిని స్టార్ లను చేసిన తమ గురువుగారి కుమారుడికి ఇలాంటి స్థితి ఎదురుకావడంతో బాధపడుతున్నారు.

Next Story

RELATED STORIES