Allu Sirish : మెగా బ్రదర్స్ శిరీష్ రిసెప్షన్ కు ఎందుకు వెళ్లలేదు

మెగా బ్రదర్స్ శిరీష్ రిసెప్షన్ కు ఎందుకు వెళ్లలేదు.. ఇదో హాట్ టాపిక్ గా మారిపోయింది. అల్లు అరవింద్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ దానికంటే మించి చాలా దగ్గర బంధువు కూడా అయిన ఈ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కు మెగా బ్రదర్స్ ఎందుకు వెళ్లలేదు అనేందుకు రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. అంటే ఆ బ్రదర్స్ కు సరైన ఇన్విటేషన్ లేదు.. ఇచ్చినా వాళ్లు అటెండ్ కాలేదు.. అంటూ చాలా రకాలుగా వార్తలు వస్తున్నాయి. బట్ ఇందులో ఒకటి మాత్రం నిజం. మెగాస్టార్ కు చేతికి గాయమైంది. ఆ మధ్య పెళ్లి కార్డ్ ఇచ్చే రోజునే ఆయన కట్టుతోనే కనిపించాడు. ఈ కట్టు నిన్ననే తీశారట. డాక్టర్స్ సలహా కారణంగానే ఆయన ఇంట్లో ఉండిపోయారు. మనసులో వెళ్లాలని ఉన్నా.. ఆయన ఇంట్లోనే ఉండిపోయారు.
పవన్ కళ్యాణ్ కూడా రిసెప్షన్ కు అటెండ్ కాలేకపోయాడు. అందుకు కారణాలు కూడా తెలియడం లేదు. పొలిటికల్ గా బిజీగా ఉన్నాడు అనలేం. ఎందుకంటే అల్లు అరవింద్ చిన్న కొడుకు పెళ్లి అంటే ఖచ్చితంగా ఆయన అటెండ్ అవ్వాల్సిందే. అయినా రాలేదు అంటే ఇంకేవైనా బలమైన కారణాలున్నాయా అనేది తెలియదు. కనీసం పవన్ కళ్యాణ్ భార్య కూడా అటెండ్ కాలేదు. అయితే వీరు రిసెప్షన్ లో కలవలేకపోయినా పెళ్లిలో మాత్రం ఖచ్చితంగా కలుస్తారు అనేది సోర్స్. ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కి రాలేకపోయినా పెళ్లికి వెళ్లి ఆశీర్వదించడం మాత్రం గ్యారెంటీ అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
