Eesha Movie : ఈషా గురించి ఎవరూ మాట్లాడ్డం లేదేంటీ..?

Eesha Movie :  ఈషా గురించి ఎవరూ మాట్లాడ్డం లేదేంటీ..?
X

ఈషా.. ఇదో హారర్ మూవీ. టైటిల్ చూడగానే ఇదేదో ఇంగ్లీష్ మూవీ లేదంటే నాన్ తెలుగు మూవీ కదా అనిపిస్తుంది కదా. బట్ అలాంటిదేం లేదు. ఈషా ఖచ్చితంగా తెలుగు సినిమానే. త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఇలాంటి మూవీస్ లో కామెడీ కూడా కనిపించడం కామన్. బట్ అలాంటిదేం లేదు.. కంప్లీట్ గా హారర్ బ్యాక్ డ్రాప్ లోనే కనిపిస్తోందీ మూవీ. మేకర్స్ కూడా అదే చెబుతున్నారు. కేవలం భయపెట్టడమే టార్గెట్ గా ఈ మూవీ రూపొందింది అంటున్నారు. ఆ మేరకు ట్రైలర్ చూస్తే కొత్తదనం ఏం కనిపించడం లేదు. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి కొత్తదనమూ లేదు.

రెగ్యులర్ హారర్ మూవీలాగానే కనిపిస్తోంది. ఒక ఇంట్లో దెయ్యాలు కనిపించడం.. ఆ ఇంట్లోకి ప్రధాన పాత్రల్లోకి ఎంటర్ అవడం.. తర్వాత వాళ్లనే ఈ దెయ్యాలు భయపెట్టడం.. చివర్లో ఏదో జరిగింది ఈ దెయ్యాలకు అనిపించేలా ఉండటం.. ఇంతే తప్ప ఇంకేం కనిపించడం లేదీ ట్రైలర్ లో. అస్సలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది ట్రైలర్ చూస్తుంటే. ఆర్టిస్టుల పరంగా కూడా వాళ్లు భయపెడుతున్నారు తప్ప.. జనం భయపడేలా లేదు అనిపించింది. ఈ తరహా సినిమాల్లోని కొత్తదనం ట్రైలర్ లోనే ఉంటుంది. పాయింట్ కొత్తగా ఉంటుందనిపిస్తుంది. బట్ ఈ మూవీలో అలాంటిదేం లేదు. అందుకే ఈ మూవీ గురించి పెద్దగా జనం మాట్లాడుకోవడం లేదు. ప్రమోషన్స్ పరంగా తెగ చేస్తున్నారు.. ఇందులో కూడా కొత్తదనం ఏం లేదు. జస్ట్ ఓ హారర్ మూవీనే కదా..అనిపించేలా ఉంది అంతే. ఇలాంటి మూవీస్ చాలా చూశాం.. అనే ఫీలింగ్ ఆడియన్స్ లో కనిపిస్తోంది. అందుకే ఈ సినిమా గురించి పెద్దగా ఎవరూ మాట్లాడ్డం లేదు. కాకపోతే ఈ జానర్ లో వచ్చే మూవీస్ లో కొత్తదనం కనిపిస్తేనే కిక్ వస్తుంది.. లేదంటే అసలుకే పోతుంది.

Tags

Next Story