RAZOR Trailer : రవిబాబు మరీ ఇంత వయొలెంట్ గా ఉన్నాడేంటీ..?

RAZOR Trailer :  రవిబాబు మరీ ఇంత వయొలెంట్ గా ఉన్నాడేంటీ..?
X

దర్శకుడు, నటుడు అయిన రవిబాబు అన్నీ వైవిధ్యమైన సినిమాలు తీశాడు.. తీస్తున్నాడు. బట్ ఫస్ట్ టైమ్ ఓ మోస్ట్ వయొలెంట్ మూవీతో వస్తున్నాడు అని రేజర్ మూవీ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. బాబోయ్.. మరీ ఈ రేంజ్ లో వయొలెన్స్ అంటే మాటలు కాదు. ఇప్పటి వరకు తెలుగులో వయొలెంట్ మూవీ అంటే నాని హిట్ 3 మూవీగానే చూస్తున్నాం. బట్ రేజర్ లో అంతకు మించి ఉండబోతోంది అనిపిస్తోంది. ట్రైలర్ లో ఒక పాపను కాపాడే వ్యక్తిగా రవిబాబు కనిపిస్తున్నాడు. అంతకు మించి ఈ ట్రైలర్ లో కథ గురించి ఏం చెప్పలేదు. ఒకటే పనిగా నరుకుడు, పొడవడం, రాడ్లతో లేపేయడం.. ఇదే ఉంది. ఆ పాపను కాపాడటం వెనక ఉండే కథ ఏంటీ..? అసలా పాప ఎవరు..? ఆ పాపకు రవిబాబుకు ఉన్న సంబంధం ఏంటీ అనేది ఓ ఫజిల్ లా ఉంది. బట్ యాక్షన్ ఎపిసోడ్స్ తో మాత్రం రవిబాబు ఫస్ట్ టైమ్ తన శైలికి మించి కనిపిస్తున్నాడు.

రేజర్ అనే టైటిల్ ఏ కారణంతో పెట్టాడో కానీ అది జస్ట్ రేజర్ మాత్రమే కాదు.. అంతకు మించి ఓ పేద్ద ఖడ్గంలా ఉన్నట్టుగా ఉంది. ఈ మధ్య కాలంలో హిందీలో కావొచ్చు, మళయాలంలో కావొచ్చు.. తెలుగులో కావొచ్చు.. ఒక్కో భాషలో ఒక్కో మూవీ మాత్రమే ఈ స్థాయిలో హింస కనిపించింది. బట్ తెలుగు నుంచి రవిబాబు కూడా ఆ లిస్ట్ యాడ్ అయిపోయాడు. మరీ ఈ స్థాయిలో హింస కనిపించడం మాత్రం ఒక్కోసారి ప్లస్ అవుతుంది.. అదే టైమ్ లో మైనస్ కూడా అవుతుంది. మరి ఈ రేజర్ ప్లస్ గా మారుతుందా లేక మైనస్ గా మారుతుందా అనేది తెలియాల్సి ఉంది.

రవిబాబు స్వయంగా డైరెక్ట్ చేసిన మూవీ ఇది. సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ లో నిర్మితమైంది. ఈ చిత్రాన్ని ఎలాంటి హడావిడీ లేకుండా ట్రైలర్ విడుదల చేయడం కూడా ఓ ప్రత్యేకంగా కనిపిస్తోంది. మే 8న విడుదల కాబోతోన్న ఈ రేజర్ ఖచ్చితంగా ఏ రేటింగ్ మూవీగా ఉంటుందని మాత్రం అర్థం అవుతోంది.


Tags

Next Story