Revanth Reddy : టాలీవుడ్ పై రేవంత్ కు ఇంత కోపం ఎందుకు..?

తెలుగు సినిమా పరిశ్రమ అంటే ఇతర పరిశ్రమల్లా కాదు. ఇండస్ట్రీలోనే కాదు.. బయట కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుకు వచ్చేది మనవాళ్లే. ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవిస్తే లక్షల్లో డొనేషన్స్ ఇస్తుంటారు. ఇది ఇక్కడే కాదు.. దేశంలో ఏ చోట జరిగినా మొదట రియాక్ట్ అయ్యేది టాలీవుడ్. అలాంటి టాలీవుడ్ కు అప్పుడప్పుడూ కొన్ని బెన్ ఫిట్స్ ఇవ్వడం ప్రభుత్వాల ధర్మం. ఆ మేరకు ఇప్పటి వరకూ అన్ని ప్రభుత్వాలూ టాలీవుడ్ కు సహకరించాయి. బెన్ ఫిట్ షోస్ కానీ, టికెట్ రేట్లు పెంచుకునే అంశాల్లో కానీ వందశాతం పర్మిషన్స్ ఇచ్చాయి. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ కూడా అదే చేస్తోంది. అయితే సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన దుర్ఘటన వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాజాగా అసెంబ్లీ సాక్షిగా టాలీవుడ్ ను ఏకి పడేశాడు. తను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం బెన్ ఫిట్ షోస్ పర్మిషన్ ఇవ్వను అని, టికెట్ ధరలు పెంచడానికి కూడా అనుమతి ఇవ్వను అని ఖరాకండీగా చెప్పేశాడు. అంతే కాదు.. అల్లు అర్జున్ ను పరామర్శించిన టాలీవుడ్ పైనా విరుచుకు పడ్డాడు.
అయితే టాలీవుడ్ పై రేవంత్ కోసం ఇప్పటిది కాదు అంటున్నారు చాలామంది. ఆయన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ రెస్పాండ్ కాలేదు. కనీసం విషెస్ చెప్పలేదు. అప్పటికీ కేసీఆర్, కేటీఆర్ ఓడిపోయారు అనే సానుభూతినే ఎక్కువగా చూపించారు.కాకపోతే ఓపెన్ గా చెప్పలేదు. తర్వాత రేవంత్ రెడ్డి నంది అవార్డ్ ల స్థానంలో గద్దర్ అవార్డ్స్ ఇస్తా అన్నప్పుడు ఎవరూ స్పందించలేదు. తనే ఓ ఫంక్షన్ లో మరోసారి గుర్తు చేసిన తర్వాత కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఏదో నామమాత్రపు సంఘం ఒకటి వేశారు. దాని ఫలితం ఏంటీ అనేది ఎవరికీ తెలియదు. ఇక రీసెంట్ గా తన బర్త్ డే రోజు టాలీవుడ్ నుంచి ఏ ఒక్కరూ విషెస్ చెప్పలేదు. ఇదే విషయాన్ని బండ్ల గణేష్ కూడా ట్విట్టర్ లో పెట్టాడు. "టికెట్ రేట్లు పెంచుకోవాలంటే, బెన్ ఫిట్ షోస్ కావాలంటే ముఖ్యమంత్రి కావాలి కానీ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు టాలీవుడ్" అంటూ బండ్ల గణేష్ చేసిన పోస్ట్ కూడా చర్చనీయాంశం అయింది.
ఇక సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన కంటే కూడా పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ కనీసం రేవంత్ రెడ్డి పేరు కూడా చెప్పలేకపోయాడు. అంటే ఆయన ముఖ్యమంత్రి అన్న విషయం కూడా గుర్తుకు లేదు. ఈ విషయాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూలో వెటకారంగా చెప్పాడు కేటీఆర్. ఆ తర్వాతే ముఖ్యమంత్రికి అల్లు అర్జున్ తప్పు కనిపించింది. అతనిపై కేస్ పెట్టించారు. కోర్ట్ వరకూ లాగారు. జైలులోనూ పెట్టించాలనే ప్రయత్నం ఒక్కరోజుతో ఆగిపోయింది. సో.. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్నే టార్గెట్ చేశాడు.ఇక నో బెన్ ఫిట్ షోస్, నో టికెట్ ప్రైస్ హైక్స్ అంటున్నాడు. మరి ఇది వ్యక్తిగత కక్షనా కాదా అనేది పక్కన పెడితే.. ఈ వ్యవహారం మాత్రం చాలా దూరమే పోయేలా ఉందంటున్నారు సగటు విశ్లేషకులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com