Janvi Kapoor : టాలీవుడ్ ఎందుకు జాన్వీ వెంట పడుతోంది..

Janvi Kapoor : టాలీవుడ్ ఎందుకు జాన్వీ వెంట పడుతోంది..
బాలీవుడ్ లోనే పెద్దగా క్రేజ్ లేని జాన్వీ కపూర్ వెనక టాలీవుడ్ ఎందుకు పడుతోంది. తన వల్ల అక్కడ లాస్ తప్ప లాభం లేదు కదా..? ఎన్టీఆర్, చరణ్ లకు మాత్రమే ఇక్కడ ప్లస్ అవుతుంది. మరి మిగతా హీరోలకు ఒరిగేదేంటీ..

టాలీవుడ్ లో ప్యాన్ ఇండియా హీరోలు పెరిగిపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరు ప్యాన్ ఇండియా సినిమా అంటున్నారు. అలా అనడంలో తప్పేం లేదు కూడా. ఎందుకంటే కంటెంట్ ఆ రేంజ్ లో ఉంటే ఆ రేంజ్ ఆడియన్స్ వరకూ తీసుకువెళ్లడం వల్ల మార్కెట్ పెరుగుతుంది. ఈ హీరోల స్థాయి కూడా మారుతుంది. అయితే ప్యాన్ ఇండియా సినిమా అంటే కాస్టింగ్ కూడా అలాగే ఉండాలి. అందుకోసం బాలీవుడ్ భామలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు మన మేకర్స్. ఎప్పటి నుంచో తెలుగుకు పరిచయం చేయాలనుకుంటోన్న జాన్వీ కపూర్ ఫైనల్ గా ఎన్టీఆర్ తో ఇంటర్డ్యూస్ అవుతోంది. పెద్ద ఎన్టీఆర్, శ్రీ దేవి జోడీకి స్పెషల్ క్రేజ్ ఉంది. అందుకే ఆవిడ కూతురు.. ఆయన మనవడు కలిసి నటిస్తున్నారన్నప్పుడు ఈ మూవీకి ప్లస్ అవుతుంది. అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరి కాంబినేషన్ క్రేజ్ తో రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సినిమాలో జాన్వీని తీసుకున్నారు. ఇక్కడా ఆ వారసత్వం ప్లస్ అవుతుంది.

బట్ ప్యాన్ ఇండియా సినిమా అంటూ నాని కోసం కూడా ఆమెనే తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ జాన్వీకి నిజంగా ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే సత్తా ఉందా అంటే కచ్చితంగా లేదు అనే చెప్పాలి. ఇప్పటి వరకూ బాలీవుడ్ లోనే తను టాప్ స్టార్ అనిపించుకోలేదు. యాక్టింగ్ పరంగానూ అద్భుతం అని చెప్పే సినిమాలూ లేవు. జస్ట్ స్కిన్ షో కోసమా అంటే.. ప్యాన్ ఇండియా సినిమా అంటూ హీరోయిన్ తో స్కిన్ షో చేయిస్తే నెగెటివ్ మార్క్ లే పడతాయి. పైగా జాన్వీ లాంటి హీరోయిన్లకు బాలీవుడ్ లో నెపోకిడ్ అనే బ్యాడ్ ట్యాగ్ కూడా ఉంటుంది. అది మొత్తం మూవీకి మైనస్ అవుతుందే తప్ప ప్లస్ కాదు. మరోవైపు వీరి రెమ్యూనరేషన్ డిమాండ్ భారీగా ఉంటుంది. వారితో పాటు వచ్చే టీమ్ కూడా చాలానే ఉంటుంది. ఇవన్నీ నిర్మాతలకు అదనపు ఖర్చులే. ఏదేమైనా ప్రస్తుతం బాలీవుడ్ లోనే టాప్ అనిపించుకోని జాన్వీ లాంటి బ్యూటీస్ వెనకే టాలీవుడ్ ఎందుకు పడుతుందో మరి.

Tags

Next Story