Ram Charan : ‘సౌండ్’కోసం గేమ్ ఛేంజర్ తంటాలు

మెగాపవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ ఛేంజర్ కు పాత కష్టాలే కంటిన్యూ అవుతున్నాయి. ఈ సినిమాపై ఎవరికీ ఏ దశలోనూ పెద్దగా ఆశలు, అంచనాలు లేవు అనేది నిజం. ముఖ్యంగా అభిమానులు అస్సలు ఓన్ చేసుకోలేకపోతున్నారీ మూవీని. రామ్ చరణ్ డ్యూయొల్ రోల్ చేశాడు. ఒకటి అప్పన్న పొలిటీషియన్ అనీ.. అందుకు తగ్గ గెటప్ తో కూడిని విజువల్స్ కూడా టీజర్ లో కనిపించాయి. అయినా అదేం సినిమాకు ‘సౌండ్’ పెంచలేకపోయింది. ఇప్పటి వరకూ వచ్చిన పాటలు ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయని కొత్త పోస్టర్స్ వేసుకోవడానికి తప్ప సినిమాపై అంచనాలైతే పెంచలేదు. ఆ మాటకొస్తే తమన్ పైనా ఫ్యాన్స్ కు నమ్మకం లేదు. అన్నిటికంటే పెద్ద డ్రా బ్యాక్ .. గేమ్ ఛేంజర్ డైరెక్టర్ శంకర్.
ఒకప్పుడు తనదైన విజువల్ గ్రాండీయర్స్ తో బలమైన కథ, కథనాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న శంకర్ ఆ టచ్ ను కోల్పోయాడు. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ ను ఆపేసి మరీ రూపొందించిన భారతీయుడు 2 చూసిన ఇంక ఆశలు వదిలేసుకున్నారు అభిమానులు. జనవరి 10న విడుదల కాబోతోన్న ఈ మూవీ గురించిన సౌండ్స్ అస్సలేం వినిపించడం లేదు. ముఖ్యంగా ఓవర్శీస్ లో బుకింగ్స్ చూస్తే చాలా అంటే చాలా పూర్ గా ఉన్నాయనే టాక్ ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన బిగ్ ప్యాన్ ఇండియన్ మూవీస్ అయిన ఆర్ఆర్ఆర్, దేవర, పుష్ప 2 చిత్రాల స్థాయిలో ఈ మూవీపై అక్కడెవరూ అభిమానం పెంచుకోవడం లేదట.. అందుకే అస్సలు టికెట్స్ తెగడం లేదు అంటున్నారు.
రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్యతో డిజాస్టర్ అందుకున్నాడు. అయినా దాని ఎఫెక్ట్ ఈ మూవీపై పడదు అనే అనుకున్నారు. కానీ భారతీయుడు 2 రూపంలో గేమ్ ఛేంజర్ కు ప్రమాదం వచ్చి పడింది. దీనికి తోడు శంకర్ తో పాటు మరికొందరు దర్శకులు కూడా కొన్ని సీక్వెన్స్ లు రూపొందించారు అనే టాక్ మైనస్ అయింది తప్ప ప్లస్ కాలేదు. ఇక థమన్ తాజాగా ‘DHOP'అనే సాంగ్ ను విడుదల చేస్తున్నాం అని చెప్పాడు. ఈ పాట గేమ్ ఛేంజర్ ను ‘సౌండ్ ఛేంజర్’ చేస్తుందని అంచనాలు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ అతను ఇప్పటి వరకూక వచ్చిన పాటలకూ అదే చెప్పాడు కాబట్టి అభిమానులు అంత సీరియస్ గా తీసుకోవడం లేదు అనే అంటున్నారు. ఇటు ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా గేమ్ ఛేంజర్ గురించి పెద్దగా సౌండేం లేదు. రీసెంట్ గా శ్రీకాంత్ తో ఓ ఇంటర్వ్యూ చేయించి హైప్ పెంచే ప్రయత్నం చేశారు. అతనేమో లీకులు ఇస్తున్నట్టుగా చెప్పాడు కానీ.. అవీ అంతగా ఆకట్టుకోలేదు.
రామ్ చరణ్ తో పాటు కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, ఎస్జే సూర్య, సునిల్ అంటూ భారీ తారాగణ ఉంది. కానీ సినిమాకు భారీ స్థాయిలో హైప్ మాత్రం రావడం లేదు. మరి ఏం చేస్తే సౌండ్ పెరుగుతుందా అని గేమ్ ఛేంజర్ టీమ్ అంతా మల్లగుల్లాలు పడుతోందట..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com