Rajamouli : రచయితగానే ఉండాల్సిన రాజమౌళి దర్శకుడు ఎందుకు అయ్యాడు?

Rajamouli : రచయితగానే ఉండాల్సిన రాజమౌళి దర్శకుడు ఎందుకు అయ్యాడు?
Rajamouli : రాజమౌళి.. అంటే పేరు కాదు..టాలీవుడ్ లో ఇదో బ్రాండ్.. బాహుబలి సినిమా చేసి తెలుగు చిత్రపరిశ్రమ గురించి ప్రపంచస్థాయిలో మాట్లాడుకునేలా చేసిన దర్శకధీరుడు.

Rajamouli : రాజమౌళి.. అంటే పేరు కాదు..టాలీవుడ్ లో ఇదో బ్రాండ్.. బాహుబలి సినిమా చేసి తెలుగు చిత్రపరిశ్రమ గురించి ప్రపంచస్థాయిలో మాట్లాడుకునేలా చేసిన దర్శకధీరుడు.. బాహుబలి మూవీతో వండర్ క్రియేట్ చేసిన జక్కన్న ఇప్పుడు RRR మూవీతో ఈ రోజు థియేటర్ లోకి వచ్చి ఓ సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు.. ఈ క్రమంలో రాజమౌళికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్ కుమారుడైన రాజమౌళి 1973 అక్టోబర్ 10న చెన్నైలో జన్మించారు. ఆయన పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి.

♦ కుటుంబ సభ్యులు రాజమౌళిని నంది అని పిలుస్తారు. బాహుబలి సినిమాలో మహేంద్ర బాహుబలి పాత్రకు శివుడు కంటే ముందు నంది అనే పేరును పెట్టారు జక్కన్న.

♦ 12 వ తరగతి వరకు చదువుకున్న రాజమౌళి ముందుగా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. ఆ తర్వాత క్రాంతికుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.

♦ తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ వద్ద సుమారుగా ఆరేళ్లపాటు కథాసహాయకుడిగా పనిచేశారు రాజమౌళి.. దర్శకులకి ఆయనే వెళ్లి స్టోరీ వినిపించేవారు.

♦ అయితే తన తండ్రి, రాజమౌళి రాసుకున్న కథలను, కొన్ని సన్నివేశాలను దర్శకులు అనుకున్న రీతిలో తెరకెక్కించడం లేదని దర్శకుడిగా మారాలని అనుకున్నారు రాజమౌళి.

♦ ముందుగా కొన్ని యాడ్స్ చేశారు రాజమౌళి..

♦ కె. రాఘవేంద్రరావు నిర్మించిన శాంతినివాసం సీరియల్‌‌కి దాదాపుగా సంవత్సరం పాటుగా దర్శకత్వం వహించారు రాజమౌళి. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఛాన్స్ వచ్చింది.

♦ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో ఫైట్స్ సీన్స్ మాత్రమే రాజమౌళి తీయాలి.. పాటలు రాఘవేంద్రరావు తెరకెక్కించాలి. మిగాతా పార్ట్ కోసం మరో డైరెక్టర్ ని అనుకున్నారు. కానీ చివరికి మొత్తం మూవీని రాజమౌళినే తీశారు.

♦ స్టూడెంట్ నెంబర్ వన్, మర్యాదరామన్న సినిమాలు మినహాయిస్తే ఇప్పటివరకు రాజమౌళి చేసిన అన్ని సినిమాలకి ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ రాసిన కథలనే తెరకెక్కించారు.

♦ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి అప్పుడే మీసాలు కూడా సరిగ్గా రాని ఎన్టీఆర్ ని హీరో అనేసరికి కొంచం బాధపడ్డారట రాజమౌళి.. రెండు మూడు రోజుల షూటింగ్ తర్వాత ఎన్టీఆర్ నటనని చూసి సంతృప్తి చెందారట.. అక్కడే ఎన్టీఆర్, రాజమౌళి మధ్య మంచి బాండ్ ఏర్పడింది.

♦ రాజమౌళి తన రెండవ చిత్రం సింహాద్రికి రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది.

♦ స్టూడెంట్ నెం .1, సింహాద్రి మధ్య రెండేళ్ల ఖాళీలో రాజమౌళి పౌరాణిక చిత్రాన్ని మలయాళ నటుడు మోహన్ లాల్‌తో ప్లాన్ చేసాడు, కానీ ఆ చిత్రం ఆగిపోయింది

♦ ఎన్టీఆర్ తో నాలుగు, ప్రభాస్ తో మూడు, రామ్ చరణ్ తో రెండు సినిమాలు తీశారు రాజమౌళి... అనుష్క, శ్రియ, సలోని లను తన సినిమాల్లో రిపీట్ చేశారు రాజమౌళి.

♦ భారతీయ పౌరాణిక కథలపై రాజమౌళికి మక్కువ ఎక్కువ. మునుపెన్నడూ చూడని స్థాయిలో మహాభారతాన్ని అతిపెద్ద చలనచిత్రంగా రూపొందించాలని జక్కన్న డ్రీమ్.. దీనికి దాదాపుగా 10 సంవత్సరాల సమయం పడుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారాయన.

♦ సాంకేతిక నిపుణుల విషయంలో ఓకే టీంని ఫాలో అవుతున్నారు రాజమౌళి.. ఎంఎం కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం ప్రతి సినిమాలో ఉంటుంది.

♦ తన సినిమాల్లో నటించిన హీరోలకి తమ తర్వాత సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నాయి. ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు దీనిని ఎవ్వరు కూడా బ్రేక్ చేయలేదు.

♦ రమని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రాజమౌళి.. తన సక్సెస్ లో తన తండ్రి పాత్ర ఎంత ఉందో, తన భార్య రమ పాత్ర కూడా అంతే ఉంటుంది అంటారు రాజమౌళి.

♦ సౌత్ లో దర్శకుడు శంకర్ తర్వాత ఫ్లాప్స్ లేని దర్శకుడు రాజమౌళినే కావడం విశేషం.

♦ తాను దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలలో మర్యాదరామన్న తనకు ఇష్టమైన సినిమా అని రాజమౌళి చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story