Kubera movie : కుబేరను వాళ్లు పట్టించుకోవడం లేదు..

Kubera movie :  కుబేరను వాళ్లు పట్టించుకోవడం లేదు..
X

తెలుగు వాళ్లు తమిళ్ సినిమాలను నెత్తిమీద పెట్టుకుంటారు. కానీ వాళ్లు అలా కాదు. మన సినిమాలను ఎప్పుడూ కాళ్ల కిందే ఉంచుతారు. బాహుబలిని చూసినా.. దానిపై ఓ రేంజ్ లో విషం కక్కిన సందర్భాలూ ఉన్నాయి. తర్వాత మన ప్యాన్ ఇండియా మూవీస్ ను కూడా వాళ్లెప్పుడూ చిన్న చూపే చూస్తున్నారు. ఇక తమిళ్ హీరోలు ఏకంగా తెలుగు దర్శకులు, నిర్మాతలతో సినిమాలు చేస్తుండటం కూడా కోలీవుడ్ వారికి నచ్చడం లేదేమో. తాజాగా విడుదలైన కుబేరకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.. ఒక్క తమిళ్ ఆడియన్స్ నుంచి తప్ప. తమిళనాడుకు చెందిన ధనుష్ ఇందులో ప్రధాన హీరో. అయినా ఈ మూవీకి అక్కడ మినిమం ఓపెనింగ్స్ రాలేదు. విశేషం ఏంటంటే.. తెలుగు కంటే తమిళ్ లోనే ఎక్కువగా ప్రమోషన్స్ చేశారు. అయినా అక్కడి ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈ మూవీ 60 కోట్లకు పైగా వసూలు చేస్తే అందులో పదో వంతు కూడా అక్కడి నుంచి రాలేదు అంటే.. కుబేరను వాళ్లు ఎంత లైట్ తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

పోనీ దర్శకుడంటే తెలియదు. నాగార్జున తెలుసు కదా. పైగా నాగ్ ఇప్పుడు కూలీలో కీలక పాత్ర కూడా చేస్తున్నాడు. రష్మిక మందన్నా తెలుసు. అయినా.. కుబేరకు అక్కడ మినిమం కలెక్షన్స్ కూడా లేవు. మరి ఎందుకు వాళ్లు ఈ చిత్రాన్ని ఓన్ చేసుకోలేకపోతున్నారు. విశేషం ఏంటంటే.. అక్కడి రివ్యూస్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. రేటింగ్స్ బావున్నాయి. అయినా కలెక్షన్స్ లేవు. దీన్ని బట్టి చూస్తుంటే తెలుగు సినిమా ఎదుగుదలను తమిళ్ ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారు. అదీ కాక వాళ్ల సినిమాలన్నీ వరుస పెట్టి బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేస్తున్నాయి. ఏదేమైనా కుబేర విషయంలో కోలీవుడ్ నుంచి ఇంత దారుణమైన వసూళ్లు మాత్రం ఎవరూ ఊహించలేదు అనే చెప్పాలి.

Tags

Next Story