Varun Tej Matka : వరుణ్ తేజ్ మట్కా సౌండే లేదేంటీ..?

Varun Tej  Matka :  వరుణ్ తేజ్ మట్కా సౌండే లేదేంటీ..?
X

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రమోషన్స్ లేకపోయినా.. చేస్తున్న ప్రమోషన్స్ ఆడియన్స్ కు రీచ్ కాకపోయినా అది సినిమా రిజల్ట్ పై ప్రభావం పడుతుంది. సరైన ప్రమోషన్ లేక కంటెంట్ బావున్నా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ విషయంలో మట్కా కూడా అలాగే కనిపిస్తోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించి చేస్తోన్న ప్రమోషన్స్ ఏవీ.. ఆడియన్స్ ను రీచ్ కావడం లేదు. పలాస ఫేమ్ కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 14న విడుదల కాబోతోంది. రిలీజ్ టైమ్ దగ్గరగా వచ్చినా మట్కా నుంచి అసలు ఎలాంటి సౌండ్ వినిపించడం లేదు. ఈ మూవీ రిలీజ్ కాబోతోందన్న విషయం మెగా ఫ్యాన్స్ లో కూడా చాలామందికి తెలియదు అంటే ఆ మూవీ టీమ్ చేస్తోన్న ప్రమోషన్స్ ఎంత డల్ గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

వరుణ్ తేజ్ తో పాటు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్ చంద్ర, సలోని, కన్నడ కిశోర్, అజయ్ ఘోష్ వంటి కీలక నటులు కనిపిస్తున్నారీ మూవీలో. కాకపోతే ఓపెనింగ్స్ వరుణ్ తేజ్ పేరు మీదుగానే రావాలి. కానీమెగా ఫ్యామిలీ హీరో అయినా వరుణ్ తేజ్ కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్లు చూస్తున్నాడు. చివరగా వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ అయితే మినిమం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక దారుణ పరాజయం చూసింది. అంతకు ముందు వచ్చిన గాండీవధారి అర్జున సైతం బిగ్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ రెండు సినిమాలకు ముందు వచ్చిన గని సైతం అంతే. ఈ మూడు సినిమాల ప్రభావం వరుణ్ తేజ్ కెరీర్ పై బలంగా పడిందనేది కాదనలేని వాస్తవం. ఆ ఎఫెక్ట్ ను తగ్గించాలంటే మట్కా సూపర్ హిట్ కావాలి. అలా కావాలంటే కంటెంట్ బలంగా ఉండాలి. ఇటు మట్కా దర్శకుడు కరుణ కుమార్ కూడా పలాస తర్వాత చేసిన సినిమాలన్నీ పోయాయి. అయితే మట్కా ట్రైలర్ తో పాటు వచ్చిన పాటలను బట్టి మరీ తీసి పారేసే సినిమా ఏం కాదు అనిపిస్తుంది. బట్.. ప్రమోషన్స్ మాత్రం చాలా వీక్ గా ఉన్నాయి.

ఇక మట్కాతో పాటు అదే రోజు విడుదలవుతున్న తమిళ్ మూవీ ‘కంగువా’కు ఎక్కువ హైప్ ఉంది. ఆడియన్స్ లో ఈ మూవీపై ఉన్న క్రేజ్ లో టెన్ పర్సెంట్ కూడా మట్కాపై కనిపించడం లేదు అనేది ఓపెన్ గానే వినిపిస్తోన్న మాట. ఏదేమైనా మట్కా మూవీ నుంచి పెద్దగా సౌండ్ అయితే వినిపించడం లేదు. రిలీజ్ వరకూ ఇలాగే ఉంటే.. రిజల్ట్ ఏంటీ అంటే ‘సైలెన్స్’అనాల్సి వస్తుందేమో కాస్త చూసుకుని ఇకనైనా ప్రమోషన్స్ లో జోరు పెంచితే బెటర్.

Tags

Next Story