Venkatesh-Roja 25 years issue: ఏంటి గొడవ.. ఎందుకు వాళ్లిద్దరు మాట్లాడుకోవట్లేదు..

Venkatesh-Roja: సినిమా ఇండస్ట్రీ లో కాంట్రవర్సీలకు కొదవే ఉండదు .. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం పై కాంట్రావర్సీ న్యూస్‌లు స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా హీరోయిన్ రోజా, విక్టరీ వెంకటేష్ మధ్య ఏదో వివాదం ఉందని ఓ వార్త బయటకు వచ్చింది. ఈ ఇరువురి మధ్య 25 ఏళ్లుగా మాటలు లేవని ఓ టాక్..
చిన్న రాయుడు సినిమాకు సంబంధించిన ఓ కారణం ఈ ఇద్దరి మధ్య విభేదాలకు దారి తీసిందని తెలుస్తోంది. రోజా భర్త సెల్వమణి దర్శకత్వంలో హీరో వెంకటేష్‌తో కలిసి ఓ సినిమా చేద్దాం అనుకుని కొన్ని చర్చలు నడిచాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు.. అదే కథాంశంతో కొన్నేళ్ల తరువాత చిన్న రాయుడు సినిమా తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. కానీ ఆ సినిమాలో రోజాకు బదులు హీరోయిన్‌గా విజయ శాంతిని తీసుకున్నారు.
సినిమా రిలీజ్ అనంతరం రోజా మండిపడింది చిత్ర యూనిట్ మీద. తాను హీరోయిన్‌గా చేయాల్సిన సినిమాని ఇంకొకరితో ఎలా చేస్తారు అని అసంతృప్తిని వ్యక్తం చేసిందట రోజా. అయితే ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, దర్శక, నిర్మాతల వల్లనే హీరోయిన్‌ని మార్చవలసి వచ్చిందని చెప్పాడట వెంకటేష్. ఆ తరువాత వెంకటేష్‌తో నటించేందుకు మరో అవకాశం వచ్చింది రోజాకి. ఆ సినిమానే పోకిరి రాజా. షూట్ కోసం రోజాని ముంబై పిలిచింది చిత్ర యూనిట్. ఆమెని అక్కడ ఓ హోటల్‌లో ఉంచారు.
కానీ హోటల్‌లో మూడు రోజులు ఉన్నాషూటింగ్‌కు సంబంధించి పిలుపు రాలేదు. దీంతో రోజాకి ఏదో అనుమానం.. దాంతో విసిగిపోయిన రోజా తన భర్త సెల్వమణి బర్త్ డే ఉందని ముంబై నుంచి వెళ్లిపోయిందట. ఆ తరువాత దర్శక నిర్మాతలు ఆమెను బతిమాలి ముంబై రప్పించి షూటింగ్ పూర్తి చేసారు. ఇక ఆ రోజే వెంకటేష్‌తో మరే సినిమాలోనూ నటించకూడదని నిర్ణయించుకుందట రోజా. ఈ విషయమే వెంకటేష్, రోజాల మధ్య విబేధాలకు కారణమైందని అంటుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com