Aishwarya Rajesh : ఐశ్వర్యకు టాలీవుడ్ లో ఆఫర్స్ పెరుగుతాయా..?

Aishwarya Rajesh :  ఐశ్వర్యకు టాలీవుడ్ లో ఆఫర్స్ పెరుగుతాయా..?
X

పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అన్నట్టుగా తెలుగు వాళ్లు తెలుగులో హీరోయిన్లుగా పనికిరారు అనే ముద్ర చాలాకాలంగా ఉంది. మనోళ్లు బయట రాష్ట్రాలకు వెళ్లి సక్సెస్ అవుతున్నారు. బయటి వాళ్లు ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. అయితే తెలుగులో మొదటి నుంచీ పెద్దగా ఫోకస్ చేయలేదు కానీ.. తమిళ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ అనిపించుకున్న భామ ఐశ్వర్య రాజేష్. ఈవిడ తెలుగమ్మాయే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఫాదర్ రాజేష్ ఒకప్పుడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించాడు. కానీ చిన్న వయసులోనే చనిపోయాడు. ఐశ్వర్య మేనత్త శ్రీలక్ష్మి మూడు దశాబ్దాల పాటు కామెడీ నటిగా అదరగొట్టింది. కానీ ఐశ్వర్య మాత్రం తమిళ్ లో హీరోయిన్ గా ఫేమస్ అయింది. అడపాదడపా తెలుగు సినిమాలు చేసినా ఇక్కడెవరూ పట్టించుకోలేదు.. కారణం.. హిట్స్ రాకపోవడం.

హిట్ వస్తే అందరి దృష్టిలో పడతారు కదా. అలా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీలో వెంకటేష్ భార్యగా మంచి నటనతో పాటు గోదావరి యాసలో డైలాగ్స్ కూడా బాగా పలికి అందరినీ ఆకట్టుకుంది. చూడగానే మన ఊరు అమ్మాయా అనిపించేంత నేచురల్ గా ఉండటం ఐశ్వర్యకు అదనంగా కలిసొచ్చే అంశం. ఈ మూవీ హిట్ కాగానే తను ఇక్కడ ఇక పాగా వేసినట్టే అని మాట్లాడుతున్నారు చాలామంది. కానీ నిజంగా ఐశ్వర్యకు తెలుగు వాళ్లు ఆఫర్స్ ఇస్తారా అనేదే పెద్ద మేటర్. ఇలా ఒకటీ రెండు విజయాలు రాగానే ఆకాశానికెత్తడం.. అన్ని ఇంటర్వ్యూస్ లో మేం ఆఫర్స్ ఇస్తాం అనడం చాలాకాలంగా చూస్తున్నదే. ఇక ఐశ్వర్య లాంటి హోమ్లీ లేడీలో మనవాళ్లు రెగ్యులర్ హీరోయిన్ ను చూస్తారా అనేది అసలు పాయింట్.

తను గ్లామర్ పాత్రలు చేసింది. కానీ తెలుగువాళ్లు యాక్సెప్ట్ చేస్తారా..? పైగా తనకిప్పుడు 35యేళ్లు. ఈ వయసులో రెగ్యులర్ హీరోయిన్ గా చేయడం దాదాపు కుదరదు. చేసినా మళ్లీ వెటరన్ హీరోలతోనే చేయాలి. దాని వల్ల తన కెరీర్ గ్రాఫ్ పెరుగుతుందా అంటే గ్యారెంటీ ఇవ్వలేం. సో.. ఐశ్వర్య ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీ విజయాన్ని ఆస్వాదిస్తోంది కానీ.. నిజంగా ఈ బ్లాక్ బస్టర్ వల్ల తనకు తెలుగులో కొత్తగా కెరీర్ బిల్డ్ అవుతుందనేది ఆల్మోస్ట్ డౌట్ అనే చెప్పాలి.

Tags

Next Story