Kishkindhapuri : కిష్కింధపురితో రాక్షసుడు రిజల్ట్ వస్తుందా..?

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వచ్చిన రాక్షసుడు సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బెల్లంకొండ కెరీర్ లో ఇప్పటి వరకూ అదే పెద్ద హిట్ కావడం విశేషం. అఫ్ కోర్స్ అది తమిళ్ మూవీకి రీమేక్.తెలుగులో మక్కీకి మక్కీ దించేశారు.అయినా హిట్టే కాబట్టి వీరిది హిట్ కాంబినేషనే అనాలి. ఈ కాంబోలో చాలా గ్యాప్ తర్వాత వస్తోన్న సినిమా కిష్కింధపురి ఈ 12న విడుదల కాబోతోంది.అప్పట్లాగానే ఇదీ రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. స్పైన్ చిల్లింగ్ హారర్ థ్రిల్లర్ గా చెబుతున్నారు మేకర్స్. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ఎంటైర్ టీమ్ ఎంతో కాన్ఫిడెన్స్ తో కనిపిస్తోంది. ఈ మూవీ ఆడియన్స్ ను విపరీతంగా భయపెడుతుందని.. ఇప్పటి వరకూ చూడనంత హారర్ కంటెంట్ ఉందని ప్రమోషన్స్ లో చెబుతున్నారు.
నిజానికి కిష్కింధపురి ట్రైలర్ బావుంది. సీట్ ఎడ్జ్ హారర్ లానే కనిపిస్తోంది. కొన్ని ట్రైలర్స్ వరకే బావుంటాయి. సినిమాలు డిజప్పాయింట్ చేస్తాయి. బట్ ఇది అలా కాదేమో అనే నమ్మకాన్ని కలిగిస్తోంది. చాలా తక్కువ టైమ్ లోనే టైట్ ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటోంది టీమ్. సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం హైలెట్ కాబోతోందని ట్రైలర్ తోనే అర్థమైంది. మొత్తంగా రాక్షసుడు తర్వాత శ్రీనివాస్, అనుపమ చేసిన ఈ మూవీ కూడా ఆ మూవీలా బ్లాక్ బస్టర్ గా నిలిస్తే ఈ పెయిర్ కు స్పెషల్ గుర్తింపు వస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com