Bhagyasri Borse : ఈ హీరోయిన్ టాలీవుడ్ టాప్ లేపుతుందా..?

ఏ భాషలోనైనా హీరోయిన్ల కొరత అనే మాట నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. చాలామంది హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. కానీ స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలకు తగ్గ స్టేచర్ కనిపించే భామలు అతి కొద్దిమందే ఉంటారు. ఉన్నవారిలో విజయం సాధిస్తేనే ఉనికిని చూపుకుంటారు. లేదంటే టాలెంట్, అందం ఎంత ఉన్నా అందరి దృష్టిలో పడటం అంత సులువు కాదు. ప్రస్తుతం తెలుగు నుంచి పూజాహెగ్డే, రష్మిక మందన్నా వంటి వారు ఉన్నా.. పూజాహెగ్డేకు ఆఫర్స్ లేవు. రష్మిక నేషనల్ వైడ్ గా ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక శ్రీ లీల, కృతిశెట్టి వంటి బ్యూటీస్ టాప్ హీరోయిన్స్ అవుతారు అనుకుంటే ఇద్దరికీ హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ టైమ్ లో టాలీవుడ్ తనూ ఓ ప్లే సంపాదించాలని చాలా హాట్ గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే.
మాస్ మహరాజ్ రవితేజ పరిచయం చేసిన ఈ బ్యూటీ ఫస్ట్ మూవీతోనే ఎరోటిక్ సాంగ్స్ తో ఓవర్ నైట్ ఫేమ్ అయింది. సినిమా బిగ్ డిజాస్టర్ అయినా తన గ్లామర్ ఆకట్టుకుంది. అందుకే వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం తను మూడు సినిమాల్లో నటిస్తోంది. రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు డైరెక్ట్ చేస్తోన్న చిత్రంలో ‘మహాలక్ష్మి’ అనే పాత్రలో కనిపించబోతోంది భాగ్యశ్రీ. దుల్కర్ సల్మాన్, రానా హీరోలుగా నటిస్తోన్న ‘కాంత’లో టైటిల్ రోల్ తనే చేస్తోంది. ఇక విజయ్ దేవరకొండతో చేసిన కింగ్ డమ్ ఈ నెల 30న విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా వచ్చిన ఓ పాట సూపర్ హిట్ అయింది. ఈ పాటలో తన నటన, లిప్ లాక్స్ రెండూ వైరల్ అయ్యాయి. మంచి ఎక్స్ ప్రెషన్స్ పలికించే సత్తా ఉన్న బ్యూటీగా ఈ పాటతో తేలిపోయింది. ఈ రెండు సినిమాలూ ఫుల్ పాజిటివ్ వైబ్స్ తో ఉన్నాయి. అలాగే రామ్ చిత్రంపైనా ఈ సారి భారీ అంచనాలున్నాయి. సో ఈ మూడూ బ్లాక్ బస్టర్ అయితే అమ్మడి రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది. ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఛైర్ కొంత ఖాళీగానే ఉంది కాబట్టి ఆ ప్లేస్ కు చేరేందుకు ఈ మూడు సినిమాల విజయాలు హెల్ప్ అవుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com