Chhaava Telugu Trailer : ఛావా.. తెలుగులో మెప్పిస్తుందా..?

ఛావా.. ఈ మధ్య కాలంలో మొత్తం ఇండియన్స్ అంతా ఈ మూవీ గురించి మాట్లాడుకున్నంతగా ఇంకే సినిమా గురించీ చెప్పుకోలేదు. అందుకు కారణం ఇది చారిత్రక నేపథ్యంలో రూపొందిన సినిమా కావడం. పైగా విలన్ గా మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ఉండట.. సినిమాలో ప్రధాన పాత్ర చేసిన హీరో ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ కావడం. ప్రధాన పాత్రలో విక్కీ కౌశల్ అసమాన నటన చూపించాడు అనే ప్రశంసలు అందుకుకున్నాడు. రష్మిక మందన్నా,అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నాడు. వీళ్లు హిందూ మత పరిరక్షణ కోసం చేసిన యుద్ధాల నేపథ్యంలో ఈ సినిమా ఉందనే కల్పిత( ఈ విషయాన్ని దర్శకుడే ఒప్పుకున్నాడు) కథతో తీసింది కావడంతో మరింతగా మాట్లాడుకున్నారీ మూవీ గురించి. అయితే ఈ చారిత్రక వక్రీకరణల గురించి ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆధారాలతో సహా పెడుతున్నారు. ఇదే విషయమై దర్శకుడు అవాస్తవాలు చెప్పాడని వంద కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీనికి భయపడే అతను తను కల్పిత కథతోనే ఈ చిత్రాన్ని రూపొందించానని క్షమాపణలు చెబుతున్నాడు.
హిందీ బాక్సాఫీస్ ను ఛావా షేక్ చేసింది. థియేటర్స్ అన్నీ జై హింద్ నినాదాలతో మార్మోగిపోయాయి. ‘మనవాళ్ల’ గురించి చరిత్రలో లేదు అంటూ ఇంకొందరు ఊగిపోయారు. అవన్నీ ఎలా ఉన్నా.. ఈ సినిమా అసలు హిందూ మతం కోసం తీసింది కాదు అని.. మరాఠా రాజ్య సంరక్షణలో భాగంగా చేసిన యుద్ధాలే తప్ప ఇందులో మతం కోణం లేదు అనేది మరికొందరి వాదన. ఎవరి వాదనలు ఉన్నా.. ఇన్ని చర్చల తర్వాత ‘మెజారిటీ’ ప్రజల కోరిక మేరకు ఇలాంటి సినిమాలు అన్ని ప్రాంతీయ భాషల్లోకి వస్తే బావుంటుందనే ఆకాంక్ష మేరకు తెలుగులో విడుదల చేస్తున్నాడు అల్లు అరవింద్.
ఈ నెల 7న ఛావా తెలుగులో విడుదల కాబోతోంది. ఈ మేరకు విడుదల చేసిన ట్రైలర్ బావుంది. డబ్బింగ్ క్వాలిటీతోనే కనిపిస్తోంది. రష్మిక మందన్నాకు డబ్బింగ్ చెప్పించినా బానే ఉంది. హిందీలో క్రియేట్ అయిన ఎమోషనల్ థింగ్ తెలుగులోనూ వర్కవుట్ అయితే ఖచ్చితంగా ఇక్కడా మంచి వసూళ్లే సాధిస్తుంది. మరి సాధిస్తుందా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com