Nawazuddin Siddiqui : 'తెలివిగా స్క్రిప్ట్‌లను ఎంచుకుంటాను, కొన్ని ప్రయోగాలు ఫలించలేదు'
కొన్ని ప్రయోగాలు అనుకున్నంతగా జరగకపోవడంతో తెలివిగా తన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటానని నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అన్నారు. ఇప్పుడు మంచి సినిమాలే చేయాలనుకుంటున్నాడు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నేటి కాలంలో అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఒకరు. అతని అప్రయత్నమైన నటన అందరి హృదయాలను గెలుచుకుంటుంది. 'సెక్షన్ 108' అనే సస్పెన్స్ డ్రామాలో ఆయన కనిపించనున్నారు. దీని టీజర్ కూడా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా టీజర్‌లో నవాజ్‌ని ఆకట్టుకునే అవతార్‌లో మేకర్స్ చూపించారు. టీజర్ లాంచ్‌లో, సిద్దిఖీ సినిమా గురించి, తన భవిష్యత్ ప్రాజెక్ట్‌లు, మరి కొన్ని విషయాల గురించి మాట్లాడారు.
2024 సంవత్సరానికి తన అభిమానుల కోసం ఏమి వేచి ఉందనే దాని గురించి మాట్లాడుతూ, "2024లో ఏమి జరుగుతుందో నాకు నిజంగా తెలియదు. కానీ.. అవును అందరూ అనుకుంటున్నట్టు నేను నా స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. తెలివిగా స్క్రిప్ట్‌లను ఎంచుకుంటాను. ప్రయోగాలు అనుకున్నంతగా జరగలేదు.. ఇప్పుడు మంచి సినిమాలక కోసం ప్రయత్నిస్తాను" నవాజుద్దీన్ సిద్ధిఖీ చెప్పారు. 'సెక్షన్ 108' చిత్రం గురించి మాట్లాడిన ఆయన.. "ఇదొక అద్భుతమైన కథ. ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వచ్చే నెలలో సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం" అని తెలిపారు. "ఈ చిత్రాన్ని అనీస్ బాజ్మీ సమర్పిస్తున్నారు. అనీస్, నేను చాలా కాలంగా కలిసి పనిచేయాలనుకుంటున్నాము, కానీ ఇప్పటివరకు అది జరగలేదు. చివరగా మేము కలిసి ఈ చిత్రాన్ని చేస్తున్నాం. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని సిద్దిఖీ అన్నారు.
ఇదిలా ఉండగా 'సెక్షన్ 108' చిత్రానికి రాశిక్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఇది సస్పెన్స్ డ్రామా. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అనీస్ బాజ్మీ సమర్పిస్తున్నారు. ఇకపోతే అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహించిన క్రైమ్ డ్రామా 'హడ్డీ'లో కూడా నవాజ్ కనిపించనున్నాడు. ఇది సెప్టెంబర్ 7 నుండి ZEE5లో ప్రసారం అవుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com