Genelia : జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అవుతుందా..?

Genelia :  జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అవుతుందా..?
X

హా హా హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులను తన నవ్వుల మాయలో వేసుకున్న బ్యూటీ జెనీలియా. అంతకు ముందే తెలుగు తెరకు పరిచయం అయినా బొమ్మరిల్లులో తన పాత్ర ఆ డెకేడ్ లోనే నంబర్ వన్ అని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించింది. ఆ తరంలో లవ్ లో ఫెయిల్ వాళ్లంతా తమ పిల్లలకు తమ లవర్ పేరు పెట్టుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. అంత గొప్ప పాత్రగా కనిపించింది. అంతకు ముందు ఆ తర్వాత సత్యం, సాంబ, నా అల్లుడు, హ్యాపీ, ఢీ, రెడీ, ఆరెంజ్ వరకూ తన హవా సాగింది. తెలుగులోనే కాక తమిళ్ లో కూడా తనదైన ఇంపాక్ట్ చూపించింది. అలాంటి జెనీలియా తను చాలాకాలంగా ప్రేమించిన హిందీ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లిచేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలు. వాళ్లు పెద్దవాళ్లవుతున్నారు. ఈ టైమ్ లో తను మళ్లీ వెండితెరపై ఎంటర్ అవడం మంచి విషయం. ఆల్రెడీ హిందీలో సితారే జమీన్ పర్ మూవీతో ఆకట్టుకుంది. ఇప్పుడు తనకు కెరీర్ ఇచ్చిన సౌత్ కు రీ ఎంట్రీ ఇస్తోంది.. జూనియర్ మూవీతో.

జూనియర్ లో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని మూవీ టీమ్ చెబుతూ వస్తోంది. కన్నడ మాజీ స్టార్ హీరో రవిచంద్రన్ కు జోడీగా ఉంటుందేమో అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఇన్నేళ్ల తర్వాత ఓ కొత్త హీరో సినిమాతో రీ ఎంట్రీ అంటే కచ్చితంగా తనకు ఆ పాత్ర బాగా నచ్చి ఉంటుంది. అందుకే ఓకే చేసింది. ఓ రకంగా చూస్తే తన సెకండ్ ఇన్నింగ్స్ కు జూనియర్ చాలా కీలకం. ఈ మూవీ విజయం సాధించడమే కాదు.. జెనీలియా పాత్ర కూడా జనాలకు బాగా కనెక్ట్ కావాలి. అప్పుడే ఈ ఇన్నింగ్స్ ఇంకొన్నాళ్ల పాటు ముందుకు వెళుతుంది. ఇండస్ట్రీకి కూడా తనకు ఎలాంటి పాత్రలు ఇవ్వాలా అనే క్లారిటీ వస్తుంది.

Tags

Next Story