Jawan : నో ప్రమోషన్స్ పాలసీని నయనతార బ్రేక్ చేయనుందా..?

దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు సంపాదించుకున్న నయనతార ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె ఇప్పుడు తన లేటెస్ట్ చిత్రం 'జవాన్'లో షారుఖ్‌తో చేసిన రొమాన్స్ ను చూడటానికి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకునన నయనతార.. ఇప్పుడు తన సినిమాలను ప్రమోట్ చేసే విషయంలో కొంచెం భిన్నంగా వ్యవహరిస్తోంది. నయనతార, తన గత ఇంటర్వ్యూలలో, తన పని గురించి మాట్లాడే ఈవెంట్‌లకు ఎందుకు వెళ్లకూడదో వివరించింది. ఆమె తన ఆలోచనలను ప్రైవేట్‌గా ఉంచడానికి ఇష్టపడుతుందని, అందరితో పంచుకోవడం సౌకర్యవంతంగా ఉండదని చెప్పింది.
నయనతార నటీనటుల మాదిరిగా కాకుండా, ఆమె తన చిత్రాలను చురుకుగా ప్రమోట్ చేయదు. అప్పట్లో కొరియోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ ప్రభుదేవాతో ప్రేమలో పడిన నయనతారకు కొన్ని సమస్యలు రావజంతో ఈ ప్రత్యేకమైన విధానాన్ని ఫాలో అవుతోంది. ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు చాలా మంది.. పెద్ద మొత్తం డబ్బు చెల్లించినప్పటికీ, చెల్లించడానికి రెడీగా ఉన్నప్పటికీ.. నయనతార మాత్రం తన సినిమాల ప్రచారంలో పాల్గొనదు. అంతే కాదు ఆమె వాటిని ప్రమోట్ చేయనని ముందుగానే ఒప్పందంపై సంతకం చేస్తుందట. అంతేకాదు ఆ సినిమాకు సంబంధించి నిర్వహించే ఇంటర్వ్యూలు, ఈవెంట్‌లు, సాధారణ ప్రచార కార్యక్రమాలలో కూడా ఆమె పాల్గొనదు.
గతంలో నయనతార చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు నయనతార తన నెక్ట్స్ మూవీ 'జవాన్' కోసం తన పాలసీని బ్రేక్ చేసి ప్రమోషన్స్ లో పాల్గొంటుందా.. లేదంటే తాను ఇంతకుముందు చెప్పిన కామెంట్స్ కే కట్టుబడి ఉంటుందా అన్న సందేహం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆమె 'జవాన్' తో బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. కాబట్టి నయనతార తన కెరీర్ కు హెల్ప్ అవుతుందన్న కారణంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుందని పలువురు భావిస్చున్నారు. ఆమె ఇటీవలే తన భర్త విఘ్నేష్ శివన్ సహకారంతో 'కనెక్ట్' చిత్రాన్ని ప్రమోట్ చేసింది. లో ప్రొఫైల్ ను మెయింటైన్ చేస్తూ వస్తోన్న నయనతార.. ఉప్పుడు 'జవాన్' వంటి హై-ప్రొఫైల్ చిత్రానికి మినహాయింపు ఇస్తుందా లేదా తెరపై తన నటనను మాట్లాడటానికి అనుమతించే ధోరణిని కొనసాగిస్తుందా అనేది చూడాలి.
'జవాన్' సెప్టెంబర్ 7, 2023న విడుదలకు సిద్దమవుతోంది. ఈ మూవీలో షారుఖ్ ఖాన్, నయనతార, దీపికా పదుకొణె నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. సమాజంలో కొంత మంది వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లను అన్వేషిస్తుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనడంతో విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com