Kalyan Ram : కళ్యాణ్ రామ్ హిట్ కొడతాడా

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త దర్శకులకు అవకాశం ఇస్తే హిట్ కొడతాడు అనే సెంటిమెంట్ ఉంది. అలాగని ప్రతిసారీ హిట్ రాలేదు. వచ్చినవి మాత్రం పెద్ద విజయాలే సాధించాయి. అతను పరిచయం చేసిన దర్శకుల్లో సురేందర్ రెడ్డి ఒకప్పుడు టాప్.. అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్నారు. ప్రస్తుతం అతను నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ చిత్రంతో ప్రదీప్ చిలుకూరి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా యేళ్ల తర్వాత పోలీస్ యూనిఫామ్ తో కనిపించబోతోంది. ఇద్దరూ ఈ మూవీలో తల్లి కొడుకులుగా నటించారు. తనలా తన కొడుకు ఐపీఎస్ కావాలనుకుంటుంది తల్లి. అతనేమో క్రిమినల్ అవుతాడు. మరి అతనెందుకు క్రిమినల్ అయ్యాడు. తల్లి కోరిక నెరవేరిందా లేదా అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న తల్లి కొడుకుల సంఘర్షణాత్మక కథ అని ట్రైలర్ చూస్తే అర్థం అయింది.
ఈ మూవీ ట్రైలర్ ను బట్టి ఇది పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్ అని అర్థం అయింది. అయితే సినిమాలో బలమైన విలన్ లేని లోటు కనిపించింది. పేరుకు సొహైల్ ఖాన్ ఉన్నా.. అతను తెలుగు ప్రేక్షకులకు అస్సలు తెలియదు. పైగా మనోడిది విలన్ కటౌట్ కాదు. ఎంత మేకోవర్ చేసినా తేలిపోయేలానే ఉన్నాడని ట్రైలర్ లో అర్థమైంది. ఆ లోటును సినిమాలో తీర్చగలిగితే హీరో ఎలివేట్ అవుతాడు. అలాగే హీరోయిజమూ పండుతుంది. ప్రస్తుతం ఫ్లాపుల్లోనే ఉన్నాడు కళ్యాణ్ రామ్. అందుకే ఈ విజయం చాలా ఇంపార్టెంట్. మరి ఈ కొత్త దర్శకుడితో కళ్యాణ్ విజయం సాధిస్తాడా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com