Suriya Kanguva : కంగువా కోలీవుడ్ కు బాహుబలి అవుతుందా..?

Suriya Kanguva :  కంగువా కోలీవుడ్ కు బాహుబలి అవుతుందా..?
X

ఇండియన్ సినిమా రేంజ్ ను ఇంటర్నేషనల్ రేంజ్ కు తీసుకువెళ్లిన సినిమా బాహుబలి. తెలుగు నుంచి ప్రారంభమైన బాహుబలి.. ఇండియన్ సినిమాకే ఐకన్ లా నిలిచింది. రాజమౌళి క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అన్ని భాషల నిర్మాతలకూ బడ్జెట్ గురించిన భయాలన్నీ తొలగించిందీ సినిమా. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే దేశవ్యాప్తంగా మార్కెట్ చేసుకోవచ్చు అనే కొత్త సూత్రాన్ని నేర్పింది. ఆ తర్వాత కన్నడ నుంచి వచ్చిన కేజీఎఫ్ వారి భాషకు తలమానికంగా నిలిచింది. మళయాల సినిమా అంటే దేశవ్యాప్తంగా అందరికీ ఇష్టం. బలమైన కథలు చెప్పడంలో వారి తర్వాతే ఎవరైనా. అయితే ఇండస్ట్రీ పరంగా తెలుగు కంటే స్ట్రాంగ్ గా ఉండే తమిళియన్స్ కు మాత్రం బాహుబలి, కేజీఎఫ్ లాంటి మూవీ లేదు. ఆ లోటును పొన్నియన్ సెల్వన్ తీరుస్తుందనుకున్నారు. బట్ అది కేవలం తమిళులలకు మాత్రమే ఫేవరెట్ అయింది. మిగతా భాషల్లో పోయింది. మనకూ ఓ బాహుబలి ఉంటే బావుండు అని సగటు తమిళ్ ఆడియన్స్ అనుకుంటోన్న టైమ్ లో మేమున్నాం అంటూ ముందుకు వచ్చింది కంగువా.

సూర్య హీరోగా శివ అండ్ టీమ్ డైరెక్ట్ చేసిన కంగువా ను జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. అందరికంటే ఈ మూవీపై అతనికే పెద్ద నమ్మకం ఉంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో కంగువా రికార్డులు బద్ధలు కొడుతుందంటున్నారు. ప్రమోషన్స్ ను కూడా చాలా అగ్రెసివ్ గా చేశారు. బాబీ డియోల్, దిశా పటానీ రూపంలో నార్త్ మార్కెట్ కు ప్లస్ అయింది. ఇటు సౌత్ లో సూర్యకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఇక్కడా భారీగా రిలీజ్ అవుతోంది. పీరియాడిక్ ఫిక్షన్ నేపథ్యంలో ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాం అని మేకర్స్ చెప్పినట్టుగానే ట్రైలర్స్ ఉన్నాయి. అందుకే ఇది తమకు ఐకనిక్ మూవీ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కోలీవుడ్ మూవీ లవర్స్. బట్ కేవలం విజువల్స్ కే పరిమితం కాకుండా బలమైన ఎమోషన్స్ తో కూడిన కంటెంట్ కూడా ఇంపార్టెంట్. ఈ ట్రైలర్స్ లో ఆ ఎమోషన్స్ ఏం కనిపించలేదు. మరి సినిమా ఎలా ఉంటుందో కానీ.. ఇది తమకు బాహుబలి అవుతుందన్న కోలీవుడ్ నమ్మకం నిజం అవుతుందో లేదో చూడాలి.

Tags

Next Story