Mirai : కార్తీక్ ఘట్టమనేని.. ఈ సారైనా హిట్టు కొట్టేనా..?

Mirai :  కార్తీక్ ఘట్టమనేని.. ఈ సారైనా హిట్టు కొట్టేనా..?
X

ప్రతి టెక్నీషియన్ కూడా ఏదో రోజు దర్శకత్వం చేయాలనే అనుకుంటాడు. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్స్ కు దర్శకత్వం కాస్త సులువు అవుతుంది. 2013లో ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో కెమెరామేన్ గా అడుగుపెట్టాడు కార్తీక్ ఘట్టమనేని. కార్తికేయతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. మూడో సినిమాకే దర్శకుడు అయ్యాడు. నిఖిల్ హీరోగా వచ్చిన సూర్య వర్సెస్ సూర్య అనే మూవీ అది. కాన్సెప్ట్ బానే ఉన్నా.. కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. కొంత గ్యాప్ తీసుకున్నాడు. కార్తికేయ 2కు ఎడిటర్ గానూ వర్క్ చేశాడు. తర్వాత రవితేజ హీరోగా ఈగల్ అనే సినిమా చేశాడు. మేకింగ్, టేకింగ్ పరంగా అద్భుతం అనిపించుకున్న ఈ చిత్రం కూడా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం మిరాయ్ అనే ప్యాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు.

తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్ గా రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల కాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేసింది. ట్రైలర్ లోనే ఆ భారీతనం కనిపిస్తోంది. ప్రొడక్షన్ పరంగా రిచ్ గా కనిపిస్తోంది. తేజ సజ్జా ఆల్రెడీ హను మాన్ మూవీతో ప్యాన్ ఇండియా ఆడియన్స్ కు పరిచయం అయ్యి ఉన్నాడు. అది ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ కాబోతోంది. పైగా అన్ని భాషల్లోనూ టాప్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాయి. ఓ రకంగా కార్తీక్ ఘట్టమనేనికి దర్శకుడుగా ఇది గ్రేట్ ఛాన్స్. బ్లాక్ బస్టర్ కొడితే ప్యాన్ ఇండియా రేంజ్ లో అతని పేరు పెద్ద సౌండ్ చేస్తుంది. మరి ఈ చిత్రంతో కార్తీక్ ఘట్టమనేని హిట్టు కొడతాడా లేదా అనేది చూడాలి.

Tags

Next Story