Devra 1 - Karthi : దేవర ముందు కార్తీ నిలుస్తాడా
తమిళ్ హీరోల్లో చాలామందికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అలాంటి వారిలో కార్తీ ముందుంటాడు. మిగతా వారి కంటే తెలుగు వాళ్లు కార్తీని కాస్త ఎక్కువ ఓన్ చేసుకున్నారు అనేది నిజం. ఫస్ట్ మూవీ నుంచే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం లాంటి రీజన్స్ తో పాటు మంచి కంటెంట్స్ తో వస్తుంటాడు అనే కారణాలూ ఉన్నాయి. అయితే అతను వచ్చే సందర్భాలు ఇంపార్టెంట్ కదా. ప్రస్తుతం అతను మేయాళవన్ అనే మూవీతో వస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో సత్యం సుందరం అనే పేరుతో డబ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఈ నెల 27న విడుదల చేస్తున్నారు. అది దేవర డేట్.
దేవరపై ఎన్ని ట్రోల్స్ జరుగుతున్నా.. అంచనాలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఓవర్శీస్ లో ఇప్పటికే అనేక రికార్డ్స్ క్రియేట్ చేసింది. ట్రైలర్ విడుదల చేయడానికి ముందే అక్కడ ఒన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా ఓ రేర్ రికార్డ్ కూడా అకౌంట్ లో పడింది. ఇటు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఆర్ఆర్ఆర్ టైమ్ నుంచే ఓన్ డబ్బింగ్ స్టార్ట్ చేశాడు ఎన్టీఆర్. అలా చూస్తే వాళ్లకూ అంతే అభిమానం ఉంటుంది కదా. ఇలాంటి టైమ్ లో కార్తీ తన మూవీని తమిళ్ వరకూ పరిమితం చేసుకుంటే బావుండేది. బట్ దేవరకు పోటీగానే వస్తున్నాడు.
సత్యం శివం ను '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ సి డైరెక్ట్ చేశాడు. కార్తీతో పాటు అరవింద్ స్వామి కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. కంప్లీట్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా ఇది. ఎన్టీఆర్ కు పోటీగా తెలుగులో విడుదల చేస్తున్నారు కానీ ఆ ప్రభావం అస్సలే మాత్రం కనిపించడం లేదు. రీసెంట్ గా వచ్చిన టీజర్ సైతం ఏమంత ఇంప్రెసివ్ గా లేదు. సో.. దూకే ధైర్యమ జాగ్రత్త.. దేవర ముందు నువ్వెంత దేవరలో ఓ పాట ఉన్నట్టుగా.. ఇది కార్తీ సినిమాకు కూడా వర్తిస్తుందేమో.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com