Keerthi Suresh : కీర్తి మెప్పిస్తుందా?

మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ పాత్రలో ప్రేక్షకులతో కంటతడి పెట్టించింది. ఇటీవల టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గినా కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. తమిళ చిత్రం 'రఘు తాత'లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదలైంది. ‘మలుపులతో కూడిన వినోదాన్ని ఆస్వాదించేందుకు రెడీగా ఉండండి' అంటూ కాప్షన్ ను జత చేశారు. కయల్విజి పాత్రలో పక్కింటి అమ్మాయిలాగా సహజంగా నటిస్తూ నవ్వులు పూయిస్తూ సాగిన ట్రైలర్లో కీర్తి నటన ఆకట్టుకుంది. హిందీ రాని ఓ తమిళ యువతీ ఎటువంటి సవాళ్ళ ను ఎదుర్కొంది చివరికి వాటిని ఎలా అధిగమించింది అనే కథ నేపధ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు సుమన్ కుమార్. ఈ చిత్రంలో రవీంద్ర విజయ్, ఎమ్మెస్ భాస్కర్ ఆనంద్ సామి, దేవదర్శిని కీలక పాత్రల లో నటించారు. 'రఘు తాత'కు శ్యాన్ రోల్డన్ సంగీతం అందించారు. కన్నడలో భారీ బడ్జెట్ చిత్రాలు కేజీఎఫ్, కాంతారా వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలు నిర్మించిన హోంభలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందుర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 15న భారీ బడ్జెట్ చిత్రాల మధ్య రిలీజ్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com