Tollywood : టాలీవుడ్ లో మళ్లీ కోలీవుడ్ హవా రానుందా

Tollywood :  టాలీవుడ్ లో మళ్లీ కోలీవుడ్ హవా రానుందా
X

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో కోలీవుడ్ హవా నడిచింది. ఆ టైమ్ లో మన దగ్గర అన్నీ రొటీన రొడ్డకొట్టుడు కథలే కనిపించాయి. మాగ్జిమం ఫ్యాక్షన్ మూవీస్ తో ఆడియన్స్ ను ఊచకోత కోశారు మేకర్స్. అస్సలే మాత్రం కొత్తదనం కనిపించేది కాదు. అప్పుడు కోలీవుడ్ నుంచి వచ్చిన డబ్బింగ్ సినిమాలు తెలుగు మార్కెట్ ను షేక్ చేశాయి. చిన్న పెద్ద సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ గ్యాప్ లోనే ఇక్కడ విక్రమ్, సూర్య వంటి వారికి మార్కెట్ క్రియేట్ అయింది. తర్వాత మళ్లీ తెలుగు సినిమా నిలబడింది. మనవాళ్లూ కొత్తదనంతో మెప్పించారు. అప్పుడు కోలీవుడ్ రొటీన్ అయింది. దీంతో ఆ మార్కెట్ డౌన్ అయింది. బట్ కొన్ని రోజులుగా చూస్తే కోలీవుడ్ సినిమాలు టాలీవుడ్ లో టాప్ లేపుతున్నాయి. హిట్ అవుతున్నాయా లేదా అనేది పక్కన పెడితే వాళ్లు ఇక్కడా తమిళ్ టైటిల్స్ తోనే సినిమాలు విడుదల చేస్తున్నారు. అయినా మనవాళ్లేం పట్టించుకోవడం లేదు.

ఇక కమల్ హాసన్ విక్రమ్, రజినీకాంత్ జైలర్ మూవీస్ తో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఆలస్యంగా మార్కెట్ తెచ్చుకున్న విజయ్ లియోకు స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వచ్చాయి. గోట్ సైతం గట్టి ఓపెనింగ్స్ దక్కించుకుంది. అజిత్ ఇంకా తేరుకోలేకపోతున్నాడు. ఈ మధ్యే వచ్చిన అమరన్ ఇక్కడ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీతో శివకార్తికేయన్ కు మార్కెట్ మొదలైంది. ఇక ధనుష్, కార్తీ వంటి వారి మార్కెట్ గురించి కొత్తగా చెప్పేదేముందీ. రీసెంట్ గా వచ్చిన రెండు చిన్న సినిమాలు జాబిలమ్మ నీకు అంత కోపమా, డ్రాగన్ దుమ్మురేపాయి. ఈ టైమ్ లో వచ్చిన తెలుగు సినిమాలు ఒన్ సైడెడ్ గా డామినేట్ చేశాయి. వీరిలో ప్రదీప్ రంగనాథన్ కు తెలుగు మార్కెట్ కూడా క్రియేట్ అయిందంటే.. కోలీవుడ్ నుంచి మరో హీరో ఇక్కడ జెండా పాతబోతున్నాడనే కదా అర్థం. ఇక నెక్ట్స్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, విక్రమ్ వీరధీర శూరన్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ధనుష్ ఇడ్లీ కొట్టు, సూర్య రెట్రో, కమల్ హాసన్ థగ్ లైఫ్, రజినీకాంత్ కూలీ తో పాటు లారెన్స్ కాంచన సిరీస్ కు తిరుగులేని డిమాండ్ ఉంది ఇక్కడ. ఈ చిత్రాల రైట్స్ కోసం మనోళ్లు ఎంత పెట్టడానికైనా రెడీ అంటున్నారు.

ఓ వైపు మనవాళ్లేమో ప్యాన్ ఇండియా అంటూ పాకులాడుతుంటే కోలీవుడ్ వాళ్లు మాత్రం తెలుగు మార్కెట్ నే డామినేట్ చేయబోతున్నారు. ఇటు తెలుగు హీరోలు కూడా దూకుడు చూపిస్తున్నా.. ఈ తమిళ్ మార్కెట్ ను డామినేట్ చేయడంలో ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారనేది నిజం. అలాగని వారిని అడ్డుకోవాలని కాదు. ప్రస్తుతం ఏ సినిమాకూ బౌండరీస్ లేవు. బట్ తమిళ్ హీరోల్లా మనవారిని అక్కడ ఎవరూ పట్టించుకోరు అనేది నిజం. మన టాప్ హీరోల సినిమాలను కూడా వాళ్లు లైట్ గానే తీసుకుంటారు. కానీ మనమే.. అందరినీ అక్కున చేర్చుకుంటున్నాం.

Tags

Next Story