Murugadoss : మురుగదాస్ కంటెంట్ మారుతుందా..?

ఏఆర్ మురుగదాస్ .. ఒకప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న దర్శకుడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇవాళ హిట్స్ ఇచ్చిన దర్శకులే తర్వాత వరుసగా ఫ్లాపులు చూస్తుంటారు. కొందరు ఆ ఫ్లాప్స్ తో ఫేడవుట్ అవుతుంటారు. ఇంకొందరు రీ స్టార్ట్ అవుతుంటారు. మరి ఈ రీ స్టార్ట్ కు మరోసారి అవకాశం దొరికింది మురుగదాస్ కి. అది కూడా అతన్లాంటి హీరోనే అయిన శింబుతో.
శింబు ప్రస్తుతం వెట్రిమారన్ తో సినిమా చేస్తున్నాడు. వీరి కాంబో కొత్తగా ఉంది. కథ పరంగా కూడా కొత్తదనం ఉంటుంది అనే నమ్మకంతో ఉన్నారు. దీంతో పాటు మరికొన్ని మూవీస్ కూడా ఓకే చేశాడు శింబు. అందులో ఒకటి మురుగదాస్ ది. మురుగదాస్ చెప్పిన కథ శింబుకు బాగా నచ్చిందట. అందుకే ఈ కథపై ఇంకాస్త వర్క్ చేయమని చెప్పాడట. అతను వర్క్ పూర్తి చేశాడు. ఫైనల్ అవుట్ పుట్ చూసి శింబుకు నచ్చింది. కట్ చేస్తే ఈ కాంబోలో మూవీ రాబోతోందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా అయితే ఈ వారం పది రోజుల్లో పబ్లిక్ అనౌన్స్ మెంట్ కూడా వస్తుందని చెప్పారు.
నిజానికి శింబుతో మూవీ చేయడానికి ఒకప్పుడు మురుగదాస్ పెద్దగా పట్టించుకోలేదు. అతను కూడా దాస్ కోసం ప్రయత్నించాడు కూడా. బట్ మంచి ఫేమ్ లో ఉన్నాడు కాబట్టి మురుగదాస్ శింబును లైట్ తీసుకున్నాడు. ఇప్పుడు లైన్ మారింది. అయినా ఒప్పుకున్నాడు అంటే శింబు గొప్పదనమే. మరి ఈ కాంబోలో వస్తున్న మూవీతో అయినా మురుగదాస్ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
