Naga Chaitanya : నాగ చైతన్య కెరీర్ బెస్ట్ కొడతాడా

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మించింది. అల్లు అరవింద్ రేర్ గా చూపించేంత కాన్ఫిడెంట్ ఈ మూవీపై చూపిస్తున్నాడు. నిర్మాత బన్నీ వాసు అయితే ఏకంగా 100 కోట్లు కొడుతున్నాం అని ముందు నుంచీ చాలా అంటే చాలా నమ్మకంగా చెబుతున్నాడు. వీరందరినీ మించి తండేల్ ను నాగ చైతన్య ఎక్కువగా నమ్మాడు. ఇక సాయి పల్లవి నటించిందంటే కథలో దమ్ముందనే కదా అర్థం. వీటికి తోడు విపరీతమైన ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడే కొందరికి డౌట్ వస్తున్నా.. మేకర్స్ మాత్రం నో డౌట్ అంటూ ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ తో దూసుకుపోతున్నారు.
తండేల్ కు సోలో రిలీజ్ అనేది బిగ్గెస్ట్ ఎస్సెట్. ముందు రోజు అజిత్ నటించిన డబ్బింగ్ మూవీ పట్టుదల రిలీజ్ ఉంది. కానీ దాని ప్రభావం తండేల్ పై అస్సలు పడదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. తండేల్ పై భారీ అంచనాలున్నాయి. అది ఆల్రెడీ ఓపెన్ అయిన బుక్ మై షో లో తెలుస్తోంది. ఇప్పటికే 30 వేలకు పైగా టికెట్స్ అమ్ముడు పోయాయి.. లక్షన్నకు పైగా ఇంట్రెస్ట్ లు చూపిస్తున్నాయి. ఈ సోలో రిలీజ్ తో నాగ చైతన్య కెరీర్ బెస్ట్ కొడితే అతని పాత ఫ్లాపులన్నీ మర్చిపోతారు. లేదంటే ఇలాంటి ఛాన్స్ ను మిస్ చేసుకున్నందుకు చాలాకాలం పాటు రిగ్రెట్ ఫీలవుతారు.
మూవీకి ఉన్న పాజిటివ్ వైబ్స్ చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యేలా కనిపించడం లేదు. లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నాగ చైతన్య, సాయి పల్లవి జంట రిపీట్ అవుతుండటం మరో ప్లస్ పాయింట్ అవుతుంది. మొత్తంగా తండేల్ తో నాగ చైతన్యకు కెరీర్ బెస్ట్ హిట్టు కొట్టే ఛాన్స్ వచ్చిందనే చెప్పాలి. మరి ఈ ఛాన్స్ ను వాడుకుంటాడా లేదా అనేది మరో మూడు రోజుల్లో తేలిపోతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com