Vetrimaaran : ఎన్టీఆర్ ఫేవరెట్ డైరెక్టర్ గ్రాండ్ ఫినిషింగ్ ఇస్తాడా

Vetrimaaran :  ఎన్టీఆర్ ఫేవరెట్ డైరెక్టర్ గ్రాండ్ ఫినిషింగ్ ఇస్తాడా
X

కొందరు దర్శకులు వేరే భాషల్లో ఆ భాష స్టార్ హీరోల వల్ల ఎక్కువగా తెలుస్తారు. అలా తమిళ్ టాప్ డైరెక్ట్ వెట్రిమారన్ తెలుగు ఆడియన్స్ కు ఎక్కువగా తెలిసింది.. అతను ఎన్టీఆర్ కు ఫేవరెట్ డైరెక్టర్ కావడం వల్ల అనేది కాదనలేని సత్యం. అంతకు ముందు కూడా వెట్రి మారన్ తెలుగు ప్రేక్షకుల్లో కొందరికి తెలుసు. బట్ వైడ్ రేంజ్ ఆడియన్స్ అతను పరిచయం అయింది.. ఎన్టీఆర్ వల్లే. మరి అతనికి ఎందుక అంత క్రేజ్ అంటే.. వెట్రి ఎంచుకునే కథలు, వాటి నేపథ్యాలే.

ప్రస్తుతం అతను విడుదలై 2 అనే మూవీతో రాబోతున్నాడు. డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోందీ మూవీ. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ పార్ట్ కు ది బెస్ట్ అప్లాజ్ వచ్చింది. ఆ పార్ట్ లో విజయ్ సేతుపతి చివర్లో కనిపించడం కొందరిని డిజప్పాయింట్ చేసినా.. బేస్ క్యాంపుల్లో పోలీస్ లు కింది స్థాయి సిబ్బందితో ప్రవర్తించే విధానం.. సాధారణ కానిస్టేబుళ్లు, ఆ ముందు గ్రేడ్ వాళ్లు కూడా పై అధికారుల చేత ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటారు అనే కోణంలో అద్భుతమైన కథనంతో కట్టి పడేస్తాడు వెట్రి మారన్. ముఖ్యంగా అప్పటి వరకూ కమెడియన్ గానే తెలిసిన సూరిని హీరోగా మార్చడం.. ఆ పాత్రను అతను అద్భుతంగా పోషించడంతో ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయింది.

ఇక లేటెస్ట్ గా సెకండ్ పార్ట్ ట్రైలర్ విడుదలైంది. ఇంకా ట్రైలర్ తెలుగులో రాలేదు. బట్ తమిళ్ లో సంచలనం సృష్టిస్తోంది. విజయ్ సేతుపతి ఇందులో పెరుమాల్ అనే వ్యక్తిగా నటించాడు. అతను జాతి, కులం, మతం, వర్గం, అంతస్తుల ఆధారంగా మనుషులను విభజిస్తూ రాజకీయాలు చేస్తూ.. వారి జీవితాలను ఇంకా చీకట్లోకి నెట్టేస్తోన్న వ్యవస్థపై తిరుగుబాటు చేస్తాడు. అతని పోరాటానికి ప్రభుత్వం వణికిపోతుంది. ఆ పెరుమాల్ ను పట్టుకోవడానికే ఫస్ట్ పార్ట్ లో పోలీస్ లు, సూరి కథ కనిపిస్తుంది. ఈ భాగంలో పెరుమాళ్ ఎవరు.. అతనెలా ఎదిగాడు, ఎందుకు ప్రభుత్వానికి సవాల్ గా మారాడు అనేది చూడబోతున్నాం అని ట్రైలర్ తో తెలుస్తుంది.

అయితే ట్రైలర్ చూస్తే ఓ రేంజ్ ఇంటెన్సిటీ కనిపిస్తుంది. రియాలిటీతో పాటు మంచి యాక్షన్ కూడా మిక్స్ అయింది. మంజు వారియర్ పాత్ర కీలకంగా ఉండబోతోందా అనిపిస్తోంది. మేకింగ్ పరంగా వెట్రి మారన్ ఎప్పుడూ బెస్ట్ అనిపించుకుంటాడు. అది మరోసారి చూడబోతున్నాం అనే ఫీలింగ్ ని ఇచ్చిందీ మూవీ. ఇళయరాజా సంగీతం చాలా రోజుల తర్వాత హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక 2024కు వెట్రి మారన్ విడుదలైన 2 గ్రాండ్ సెండాఫ్ ఇవ్వబోతోందని తమిళ మీడియా అంతా అంటోంది.

Tags

Next Story