They Call Him O.G : ఓ.జి రికార్డులు బ్రేక్ చేస్తుందా..?

They Call Him O.G :  ఓ.జి రికార్డులు బ్రేక్ చేస్తుందా..?
X

పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత హైప్ వచ్చిన సినిమా ఓ.జి. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ గ్యాంగ్స్ స్టర్ డ్రామాపై ముఖ్యంగా అభిమానుల్లో అంతులేని అంచనాలున్నాయి. ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ అంచనాలు డబుల్ అయ్యాయి అనే చెప్పాలి. 1980 -90ల కాలంలో ముంబై నేపథ్యంగా సాగే కథ అని ముందే చెప్పారు.ఆ కాలంలో ముంబైలో గ్యాంగ్ వార్స్ ఎక్కువగా సాగేవి. ఆ బ్యాక్ డ్రాప్ లో హిందీలో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. ఇటు పవన్ కళ్యాణ్ చేసిన బాలు, పంజా చిత్రాలు కూడా ఆ నేపథ్యంలోనివే. కానీ ఇప్పటి మేకర్స్ ఇలాంటి పీరియాడిక్ మూవీస్ విషయంలో వెటరన్స్ కంటే దూకుడుగా ఉన్నారు. క్లారిటీతో పాటు హీరోల ఇమేజ్ ను ఆ కాలంలోకి సులువుగా అడాప్ట్ చేస్తున్నారు. అందుకే తెలుగులో పీరియాడిక్ మూవీస్ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. సో.. ఓ.జి కూడా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనిపిస్తోంది.

అయితే కొన్నాళ్లుగా పవన్ నుంచి రికార్డ్ బ్రేకింగ్ మూవీస్ రాలేదు. ఓ రకంగా చెబితే అత్తారింటికి దారేది తర్వాత ఆయన్నుంచి కొత్త రికార్డులు రాలేదు. ఆ లోటును ఓ.జి భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. అటు ఇండస్ట్రీలో కూడా ఈ చిత్రం కోసం ఈగర్ గా చూస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన మిరాయ్ బాక్సాఫీస్ కు కొత్త జోష్ తెచ్చింది. ఆ జోష్ ను డబుల్ చేస్తూ దసరా హాలిడేస్ ను ఓ.జితో కలిపి ఎంజాయ్ చేసేలా ఈ మూవీ ఉంటే ఖచ్చితంగా రికార్డ్స్ గ్యారెంటీ.

టికెట్ ధరలను భారీగా పెంచడం వల్ల ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ఓ.జి కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే మొదటి ఆటకే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఈ దసరా హాలిడేస్ వల్ల ప్యాన్ ఇండియా కాకుండా తెలుగు నుంచే భారీ వసూళ్లు వచ్చే అవకాశాలున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం ఈ మూవీ సాధించబోయే రికార్డ్స్ కోసం టాలీవుడ్ ఎదురు చూస్తుంది.

Tags

Next Story