Pooja Hegde : పూజా కూడా తమన్నా అంత ఇంపాక్ట్ చూపించగలదా

Pooja Hegde :  పూజా కూడా తమన్నా అంత ఇంపాక్ట్ చూపించగలదా
X

కొన్ని పాటలు కొన్ని సినిమాలకు భలే ఎసెట్ అవుతాయి. కేవలం పాటలే తిరుగులేని ప్రమోషన్స్ గా మారతాయి. అలా కొన్ని రోజుల క్రితం జైలర్ మూవీ కోసం తమన్నా చేసిన ఐటమ్ సాంగ్ ఆ మూవీ రేంజ్ ను మార్చింది అంటే అతిశయోక్తి కాదు. వా.. నువ్వు కావాలయ్యా అనే ఆ పాట అతి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకూ రీల్స్ గా చేసుకునేంత ఇంపాక్ట్ చూపించింది. జైలర్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ అయినా ఆ సినిమాకు సంబంధించి ఎక్కువగా మాట్లాడుకుంది మాత్రం తమన్నా గురించే అనేది కాదనలేని సత్యం.

ఇక ఈ ఛాన్స్ ఇప్పుడు పూజా హెగ్డేకు వచ్చింది. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తోన్న కూలీ సినిమాలో పూజా హెగ్డే ఓ ఐటమ్ సాంగ్ చేస్తుందనే వార్త ముందే చెప్పారు. లేటెస్ట్ గా ఆ సాంగ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మూవీపైనా భారీ అంచనాలున్నాయి. లోకేష్ లాస్ట్ మూవీ లియో అంచనాలను అందుకోలేదు. రజినీకాంత్ తో ఫస్ట్ టైమ్ సినిమా చేస్తుండతటంతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్య రాజ్, శృతిహాసన్, సౌబిర్ షబిన్ వంటి వారు నటిస్తుండటంతో కూలీ పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అలాంటి సినిమాలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ హైలెట్ అయితే అమ్మడు కూడా నేషనల్ వైడ్ గా పాపులర్ అయిపోతుందనడంలో ఏ డౌట్ లేదు. ఏదేమైనా తమన్నాలా పూజా హెగ్డే కూడా ఆ రేంజ్ ఇంపాక్ట్ చూపించాలంటే ముందు ఆ పాటలో సత్తా ఉండాలి.

Tags

Next Story