Ravi Teja : రవితేజ వల్ల పూరీ లాస్ అవుతాడా

Ravi Teja : రవితేజ వల్ల పూరీ లాస్ అవుతాడా

పూరీ జగన్నాథ్ చాలా కాన్ఫిడెంట్ గా రూపొందించిన సినిమా డబుల్ ఇస్మార్ట్. రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా సంజయ్ దత్ విలన్ గా నటించిన మూవీ ఇది. ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. అయితే సడెన్ గా అదే డేట్ కు రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీని కూడా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పోటీ పెరిగింది. పూరీ జగన్నాథ్ లైగర్ తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. కమర్షియల్ గా చాలా లాస్ అయ్యాడు. అయినా నానా ఇబ్బందులూ పడి ఈ మూవీని పూర్తి చేశాడు. ఈసినిమాకూ ఫైనాన్స్ ప్రాబ్లమ్ అయింది. అందుకే మార్చిలో రావాల్సిన సినిమా ఆగస్ట్ లో వస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన బిజినెస్ కావొచ్చు.. వచ్చిన కంటెంట్ కావొచ్చు డబుల్ ఇస్మార్ట్ ను మాగ్జిమం గ్యారెంటీ అనేలా చేస్తోంది. ఇప్పటికే సినిమాను అమ్మేయడం పూరీకి పెద్ద రిలీఫ్. ఇటు లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ ను ఇష్యూస్ వస్తాయనుకుంటే రిలీజ్ కు చాలా రోజుల ముందే ఆ ప్రాబ్లమ్ ను ఛాంబర్ ద్వారా క్లియర్ చేసుకున్నాడు. ఇన్ని హ్యాపీస్ నడుమ విడుదలవుతోన్న డబుల్ ఇస్మార్ట్ కు మాస్ మహరాజ్ షాక్ తప్పేలా కనిపించడం లేదు.

రవితేజ, పూరీ జగన్నాథ్ బాండింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కెరీర్ ఆరంభంలో ఇద్దరూ కలిసి ఎదిగారు. స్టార్డమ్ తెచ్చుకున్నారు. పూరీ ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు రవితేజ దేవుడు చేసిన మనుషులు మూవీతో సాయంగా నిలిచాడు. కానీ పూరీ నిలబెట్టుకోలేదు. అప్పటి నుంచే పడతూ లేస్తూ వస్తున్న పూరీ చాలా రోజుల తర్వాత కొంచెం ఎక్కువ హ్యాపీగా డబుల్ ఇస్మార్ట్ ను విడుదల చేయబోతున్న టైమ్ లో రవితేజ పోటీలోకి రావడం ఖచ్చితంగా అతనికి షాక్ ఇచ్చే అంశమే.

మార్కెట్ పరంగా చూసినా, ఓపెనింగ్ స్టామినా చూసినా రామ్ కంటే రవితేజ ఎన్నో రెట్లు బెటర్ పొజిషన్ లో ఉన్నాడు. అటు హరీష్ శంకర్ ఛరిష్మానూ తక్కువ అంచనా వేయలేం. డబుల్ ఇస్మార్ట్ కు ఏ మాత్రం మిక్స్ డ్ టాక్ వచ్చినా.. మిస్టర్ బచ్చన్ హిట్ టాక్ తెచ్చుకున్నా.. పూరీకి మరోసారి లాస్ తప్పదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. పైగా ఇప్పుడు పూరీతో పాటు హీరో రామ్ కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. ఏదేమైనా రవితేజ బచ్చన్ మూవీతో అతని బెస్ట్ ఫ్రెండ్ పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ కు గట్టి షాకే తగలబోతోందంటున్నారు విశ్లేషకులు.

Tags

Next Story