Andhra King Taluka : ఆంధ్రాకింగ్ తాలూకాలో రామ్ కింగ్ అవుతాడా

ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ పోతినేని. ఆ ట్యాగ్ కు సరిపోయేలా అతనిలో ఎనర్జీ ఉన్నా.. మూవీస్ లో మేటర్ మాత్రం కనిపించడం లేదు. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ సారి గ్యారెంటీ హిట్ అనిపించేలా అతను ఆంధ్రాకింగ్ తాలూకా అనే మూవీతో వస్తున్నాడు. టైటిల్ కు తగ్గట్టుగా ఆంధ్రాకింగ్ గా కన్నడ హీరో ఉపేంద్ర హీరోగా కనిపించబోతున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. మహేష్ బాబు పి డైరెక్ట్ చేసిన మూవీ ఇది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన మూవీ.
తాజాగా ఆంధ్రాకింగ్ తాలూకా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుంచి యూ / ఏ సర్టిఫికెట్ వచ్చింది. కంప్లీట్ గా కమర్షియల్ ఎంటర్టైనర్ గా టాక్ వచ్చింది సెన్సార్ నుంచి వచ్చింది. అయితే ఈ మూవీతో రామ్ పోతినేని కెరీర్లో బ్లాక్ బస్టర్ అందుకుంటాడా అనే ప్రశ్నలు కనిపిస్తున్నాయి. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఈ మూవీ కోసం ఓ పాట కూడా స్వయంగా రాశాడు. హీరోయిన్ తో ఎఫైర్ అనే రూమర్ వచ్చింది. టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఉపేంద్ర ఇమేజ్ మాత్రం సినిమాకు ప్లస్ అవుతుంది అనే టాక్ ఉంది.
రామ్ మాత్రం ఇప్పటి వరకు ఎప్పటి లాగానే ఈ మూవీకి ప్రమోషన్స్ చేయలేదు. సినిమా గ్యారెంటీ హిట్ అనిపించుకునేలా ప్రమోషన్స్ చేశాడు. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనిపించుకున్నాడు. దర్శకుడిని బలంగా నమ్మినట్టుగానూ కనిపిస్తున్నాడు. డైరెక్టర్ లో కూడా మేటర్ ఉన్నట్టుగానే కనిపిస్తోంది. మొత్తంగా ఈ మూవీ మాత్రం గ్యారెంటీ హిట్ అనిపించుకునేలా కనిపిస్తున్నాడు రామ్ లో. మరి రామ్ నమ్మకం నిజం అయిపోయి ఆంధ్రాకింగ్ తాలూకా మంచి విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

